Home » CJI
భారత అత్యున్నత న్యాయస్థానంలో ఇంట్రస్టింగ్ సీన్ నడిచింది. ఓ కేసులో విచారణ సందర్భంగా ప్రముఖ న్యాయవాది ముఖుల్ రోహత్గీ రెండు మద్యం బాటిళ్లను తీసుకువచ్చి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ముందు పెట్టారు. ఆ బాటిళ్లను చూసి సీజేగా గట్టిగా నవ్వేశారు. ఈ బాటిళ్లను మీరే తెచ్చారా? అంటూ న్యాయవాదిని అడిగారు. దానికి అవునని బదులిచ్చిన న్యాయవాది.. కేసులో సారూప్యతను వివరించడం కోసం వీటిని తీసుకురావడం జరిగిందని వివరించారు.
శ్రీకృష్ణ భగవానుడు కొలువైన ద్వారకను భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ శనివారంనాడు దర్శించుకున్నారు. ద్వారకాధీశుని ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పసుపు రంగు దుస్తులు ధరించి సతీ సమేతంగా ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. సీజేఐ రాక సందర్భంగా ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ఉత్తరప్రదేశ్లోని ఓ మహిళా న్యాయమూర్తి సీనియర్ల వేధింపులు తాలలేక ఆత్మహత్యకు అనుమతి కోరుతూ రాసిన బహిరంగ లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కోర్టు ముందుకు వచ్చిన కేసులను వాయిదా వేయాలని కోరటాన్ని సుప్రీం కోర్టు(Supreme Court) సీజేఐ జస్టిస్ చంద్రచూడ్(CJI Justice Chandrachud) తప్పుబట్టారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కేసు వాయిదాలతో "తారీక్ పే తరీక్"(తేదీ తరువాత తేదీ)గా కోర్టు మారకూడదని ఉద్ఘాటించారు. గడిచిన రెండు నెలల్లో 3,688 కేసులను న్యాయవాదులు వాయిదా వేయాలని కోరారని వెల్లడించారు.
దేశంలో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్ట బద్ధత కల్పించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యంగ ధర్మాసనం నేడు కీలక తీర్పు వెల్లడించింది.
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్ట బద్ధత కల్పించే అంశంపై సుప్రీం కోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. స్వలింగ సంపర్కుల వివాహాలపై భిన్నాభిప్రాయలున్నాయన్న సీజేఐ చంద్రచూడ్ వారి వివాహానికి చట్టబద్దత కల్పించలేమని స్పష్టం చేశారు.
స్వలింగ సంపర్కుల వివాహాలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నలుగురు సభ్యులతో కూడిన న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసింది.
మణిపూర్(Manipur)లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యాయమూర్తులకు కల్పించిన ప్రోటోకాల్ సదుపాయాన్ని ఇతరులకు అసౌకర్యం కలిగే రీతిలో ఉపయోగించుకోవద్దని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ న్యాయమూర్తులను కోరారు. న్యాయ వ్యవస్థ ద్వారా లభించిన అధికారాన్ని ధర్మాసనంపైన, ధర్మాసనం బయట వివేకవంతంగా వినియోగించాలని తెలిపారు.
న్యాయమూర్తుల నియామకాల కోసం అనుసరిస్తున్న కొలీజియం విధానం అత్యంత శక్తిమంతంగా, క్రియాశీలంగా ఉందని, అది తన కర్తవ్యానికి కట్టుబడి, నిబద్ధతతో పని చేస్తోందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ చెప్పారు. ఇటీవల ఈ వ్యవస్థ సిఫారసు చేసిన 72 గంటల్లోనే ఇద్దరు న్యాయమూర్తుల నియామకం జరగడమే దీనికి నిదర్శనమని చెప్పారు.