Home » CS Shanti Kumari
రాష్ట్రంలో ప్రబలుతున్న జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
పంద్రాగస్టు వేడుకల్లో వెయ్యి మంది కళాకారుల ప్రదర్శనలుంటాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
తెలంగాణ ఆవిర్భావం నుంచి 2023 స్వాతంత్ర్య వేడుకల వరకు మాజీ సీఎం కేసీఆరే(KCR) గోల్కొండపై జెండా ఎగురవేసేవారు. కాగా.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తొలిసారి జెండా పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.
రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం.. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘనవిజయం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కీలకమైన నాలుగు ప్రాజెక్టులకు ప్రపంచబ్యాంకు సహకారం లభించింది.
తెలంగాణ రాష్ట్రంలో మరో మూడ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అప్రమత్తం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం సమీక్షిస్తున్నారని, జిల్లాల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు.
ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్లో అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులు జారీ చేయడం గానీ, వారు పొందిన మొత్తాన్ని రికవరీ చేయడం గానీ చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతి కుమారి సచివాలయంలోని ఆయా విభాగాలు, అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
రాజధాని నగర విస్తరణకు అనుగుణంగా ప్రజలకు విస్తృత సేవలందించేలా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. ఇవి దాదాపు వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. 25న లేదా 26న రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టవచ్చని సమాచారం.
తెలంగాణ రాష్ట్రంలో 8మంది ఐపీఎస్‌లను బదిలీ(IPS Officers Transfer) చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (CS Shanti Kumari) సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఐపీఎస్‌ల బదిలీలు జరగగా.. తాజా మరికొంత మందిని ట్రాన్స్ఫర్ చేశారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(Shantikumari) కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు.