Home » Education
నీట్ యూజీ పరీక్షను రద్దు చేయొద్దని.. అలా చేస్తే నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.
CTET 2024 Admit Card : సీటెట్ కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులకు బిగ్ అలర్ట్. జులై 7వ తేదీ నుంచి జరగనున్న సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(CTET-2024) పరీక్షల కోసం అడ్మిట్ కార్డును సెంట్రలో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్(CBSE) విడుదల చేసింది.
విద్యా కానుకను కావాల్సిన వారికి కట్టబెట్టడం వెనుక విద్యా శాఖ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హస్తం ఉందన్న విషయం వెలుగులోకి వస్తోంది. ఆయన ఒత్తిడితోనే అప్పట్లో అధికారులు టెండర్లకు మంగళం పాడేశారు.
ప్రిన్సిపాల్ తమపై వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఓ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ విద్యార్థినులు రాస్తారోకోకు దిగారు. ఆ మహిళా ప్రిన్సిపాల్‌ను వెంటనే మార్చాలంటూ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఈ ఘటన సుర్యాపేట జిల్ల్లా కేంద్రం సమీపంలోని బాలెంలలోని డిగ్రీ కళాశాలలో జరిగింది.
ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా తొలి రోజైన గురువారం 56,674 మంది అభ్యర్థులు స్లాట్లను నమోదు చేసుకున్నారు. ఈ కౌన్సెలింగ్‌లో భాగంగా అభ్యర్థులు స్లాట్లను నమోదు చేసుకోవడానికి ఈ నెల 12వరకు గడువు ఉంది.
మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎలాంటి అనుమతులు లేకుండా బాలానగర్‌లో ఏర్పాటు చేసిన మల్లారెడ్డి యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కామర్స్ అండ్ డిజైన్ (ఆఫ్ క్యాంప్‌స)పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), రాష్ట్ర ఉన్నతవిద్యామండలికి ఆదేశాలు జారీచేసింది.
గత వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో భారీస్థాయిలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రామస్థాయిలో పలువురు ఆటగాళ్ల ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ఆర్భాటానికే పరిమితమైంది. నామమాత్రంగా క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన, కబడ్డీ, ఖోఖో తదితర ఆటల పోటీలు నిర్వహించారు. ఇందుకోసం ఒక్కో సచివాలయానికి ...
జగన ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయంతో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లోకి విలీనం చేశారు. దీంతో కి.మీ. దూరం వెళ్లలేక కొందరు బడి మానేశారు. మరికొందరు ప్రైవేటు బాట పట్టారు. బెళుగుప్ప మండలంలోని గంగవరంలో సమస్య మరింత జఠిలంగా మారింది. ఇక్కడ విలీనాన్ని వ్యతిరేకిస్తున్న తల్లిదండ్రులు.. 3, 4, 5 విద్యార్థులను ప్రాథమిక పాఠశాలకే పంపుతున్నారు. నాటి ప్రభుత్వ ఆదేశాల కారణంగా వీరికి పాఠాలు చెప్పాల్సిన ....
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం(AP Open School Society) జూన్-2024లో నిర్వహించిన పది, ఇంటర్మీడియట్(ఏపీఓఎస్ఎస్) పబ్లిక్ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలకు 15,058మంది విద్యార్థులు హాజరుకాగా 9,531మంది పాసయ్యారు. 63.30ఉత్తీర్ణత శాతం నమోదైంది.
కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ పాఠశాలలు, శిశు మందిరాలను ఛిన్నాభిన్నం చేశాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) అన్నారు. సంస్కృతీ, సంప్రదాయాలకు శిశుమందిర్ పాఠశాలలు(Shishumandir Schools) నిలయాలని కేంద్ర మంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ (Husnabad) సరస్వతీ శిశుమందిర్ పాఠశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు.