Home » Health Secrets
కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉండడం వల్ల మన శరీరానికి కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తాయి. అయితే ఇలాంటి గొప్ప ఔషధ గుణాలు కలిగిన కరివేపాకుతో టీ చేసుకుని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మీకు తెలుసా. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఎందుకంటే మన రోజువారీ కార్యక్రమాలు అన్ని దానిపైనే ఆధారపడి ఉంటాయి. అలాగే మంచి జీవనశైలితో ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. అందుకు తగిన విధంగానే వారు ప్రతిరోజూ వ్యాయామాలు చేస్తూ తీవ్రంగా కృషి చేస్తుంటారు. అందులో భాగంగానే మద్యం వంటి మత్తుపదార్థాలకు దూరంగా ఉంటారు. ఎందుకంటే ఇవి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపి కాలేయం, కిడ్నీలు వంటి అవయవాలను దెబ్బతీస్తాయి. అటువంటి వారు సైతం తమకు తెలియకుండానే లివర్ డ్యామేజ్ చేసే ఆహార పదార్థాలు తరచుగా తింటుంటారు. అవి ఎంటో ఇప్పుడు చూద్దాం..
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అయితే కొన్ని సీజనల్ వ్యాధులు అనేవి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వస్తూనే ఉంటాయి. అయితే దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలను మన జీవనశైలి, మంచి ఆహారం, వ్యాయామం ద్వారా దరి చేరకుండా చేయవచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ పోషకాలు కలిగిన మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అలాంటి కోవలోకి వచ్చేదే సగ్గుబియ్యం. సగ్గుబియ్యమే కదా అని తేలికగా తీసిపడేయెుద్దు. వాటిని రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..
రాష్ట్రంలో విష జ్వరాలు దడ పుట్టిస్తున్నాయి. జ్వరాలతో రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. జ్వరం బారిన పడి మంగళవారం వరంగల్ జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థితోపాటు మహబూబ్నగర్ జిల్లాలో ఓ 58 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు.
సాధారణంగా మెదడులో కణితిని తొలగించాలంటే.. పుర్రె భాగానికి కోత పెట్టాలి! కానీ.. మెదడులో కణితితో బాధపడుతున్న 54 ఏళ్ల మహిళకు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు ఓ అరుదైన శస్త్రచికిత్సతో ఉపశమనం కలిగించారు!
తిన్నది గొంతులోనే ఉండిపోయినట్టు అనిపిస్తూ, ఛాతీ మంట కూడా వేధిస్తుంటే ఎవరైనా దాన్ని అజీర్తి సమస్యగానే భ్రమపడతారు. దాంతో జీర్ణకోశ వైద్యులను సంప్రతించి మందులు వాడుకోవడం మొదలు పెడతారు.
చక్కెర ఎంత తీయగా ఉంటుందో శరీరానికి అంత చేటు చేస్తుంది. చక్కెర పేగుల్లోని చెడు బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడుతుంది. శరీరంలో నొప్పితో కూడిన వాపులు (ఇన్ఫ్లమేషన్), సోరియాసిస్, మొటిమలు, ఎగ్జీమా, చర్మం సాగిపోవడం లాంటి చర్మ సంబంధ సమస్యలకు కూడా కారణమవుతుంది.
మన శరీర ఆకృతికి.. మానసిక ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మంచి శారీరక ఆరోగ్యం ఉన్న వారికి మానసికంగా ఒత్తిడి కూడా తక్కువగా ఉంటుంది.
కాలుష్యాలతో నిండిన వాతావరణంలో శరీరం నుంచి కలుషితాలు, విషాలను వెళ్లగొట్టడానికి మెరుగైన మార్గం ఉపవాసం పాటించడం.
కొన్ని ఆరోగ్య సమస్యలకు సమాధానం ఆహారంలోనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇన్ఫ్లమేషన్ లక్షణాలను ఆహారంతో మెరుగ్గా అదుపులోకి తెచ్చుకోవచ్చు.