Home » Hyderabad News
ఏం జరిగిందో ఏమో.. హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబంలోని ముగ్గురు తమ ఇంటి బాత్రూమ్లోనే శవాలై కనిపించారు. సనత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన వెలుగు చూసింది.
భార్యపై అనుమానం.. ఆపై ఆర్థిక ఇబ్బందులతో సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో ఓ భర్త భార్యను, ఉయ్యాలలో నిద్రిస్తున్న తన 11 నెలల కన్న కూతురిని ప్లాస్టిక్ వైర్‌తో ఉరేసి చంపి.. ఆపై తానూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర నేపథ్యంలో సికింద్రాబాద్(Secunderabad) పరిసర ప్రాంతాల్లో ఈనెల 21, 22 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
ఆదివారం రోజున జేఎన్టీయూ(JNTU) బాయ్స్ హాస్టల్లో ఆహారాన్ని పిల్లి తినడంపై యాజమాన్యం స్పందించింది. ఆహారాన్ని పిల్లి తినలేదని అధికారుల బృందం తేల్చిందని ప్రిన్సిపల్ నర్సింహారెడ్డి(Principal Narsimha Reddy) చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే వీడియోను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారంటూ ఆయన సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై విచారణ చేపట్టినట్లు ప్రిన్సిపల్ చెప్పుకొచ్చారు.
ఈమధ్య కాలంలో కొందరు దుండగులు నిరుద్యోగుల్ని టార్గెట్ చేసుకొని భారీ మోసాలకు పాల్పడుతున్నారు. మంచి జీతాలిచ్చే పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ శఠగోపం పెడుతున్నారు. వారిని నమ్మించేందుకు..
వింటేజ్ కార్లు.. ఈ పేరు ఎప్పుడూ వినలేదా. ఇప్పుడు హైదరాబాద్ సహా దేశంలోని పలు అభివృద్ధి చెందుతున్న పట్టణాలు, గ్రామాల్లో ఇదే ఇప్పుడు ట్రెండ్. బైక్ కొనుగోలు చేసే డబ్బులతో ఇది అందుబాటులో ఉండటం ప్రత్యేకం. ఈ మోడళ్లో మారుతున్న కాలానికి తగ్గట్లు కరెంటుతో నడిచే కార్లను అందుబాటులోకి తెస్తున్నారు.
ఇకపై కరెంటు బిల్లులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కట్టొచ్చు. ఈ మేరకు వినియోగదారులకు కొత్త సదుపాయం కల్పిస్తూ తెలంగాణ డిస్కమ్‌లు నిర్ణయం తీసుకున్నాయి. థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా చెల్లింపును నిలిపివేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడంతో గూగుల్/ఫోన్‌పే/అమేజాన్ పే లేదా పేటీఎంల ద్వారా కరెంటు బిల్లులు చెల్లించేందుకు బాగా అలవాటు పడ్డవారు కొంత ఇబ్బందుల్లో పడ్డారు.
ఎంబీబీఎస్ పూర్తి చేసిన మహిళా డాక్టర్ డిప్రెషన్‌తో భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పండింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో(Nagole Police Station) చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏఎస్ రావు నగర్‌కు(AS Rao Nagar) చెందిన కాకర్ల నాగేశ్వరావు కొంతకాలం క్రితం..
రైతుభరోసా పథకం అమలుకు అనుసరించాల్సిన విధివిధానాలు, మార్గదర్శకాలపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.
ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై దాడికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఈ దాడి ఘటనపై పార్లమెంట్ స్ట్రీట్‌లోని పోలీస్‌స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.