Home » ICC
ICC ODI Rankings: టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బ్యాటర్‌గా అవతరించాడు. 24 ఏళ్ల వయసులోనే నంబర్ వన్ ర్యాంకు దక్కించుకున్న గిల్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 951 రోజులుగా నంబర్ వన్ వన్డే బ్యాటర్‌గా కొనసాగిన పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్ అధిపత్యానికి తెరదించాడు. మొత్తంగా అత్యధిక కాలం వన్డే నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగిన ఆటగాళ్ల జాబితాలో బాబర్ ఆరో స్థానంలో ఉన్నాడు.
వన్డే ప్రపంచకప్‌లో రాణిస్తున్న టీమిండియా ఆటగాళ్లు ఐసీసీ వన్డే ర్యాంకుల్లోనూ సత్తా చాటారు. టాప్-10 జాబితాలో ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు స్థానం సంపాదించారు.
ఈ వరల్డ్ కప్‌లో తొలి రెండు మ్యాచెస్‌లో ఘోర పరాభవాల్ని చవిచూసిన ఆస్ట్రేలియా ఎట్టకేలకు బోణీ కొట్టింది. లక్నోలోని ఏకనా స్పోర్ట్స్ సిటీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో విజయకేతనం...
ప్రస్తుతం పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్ నడుస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భారత రైల్వే టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ‘కన్ఫమ్ టికెట్’ (ConfirmTkt)తో ఓ కీలక ఒప్పందం...
సెప్టెంబర్ నెలకు గాను టీమిండియా యువ ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్ ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి ప్రవేశించి ఆటంకం కల్గించిన జార్వోకి ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. అతను ఈ ప్రపంచకప్‌లోని మరే మ్యాచ్‌కు హాజరుకాకుండా నిషేధం విధించింది.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ పోటీలు అక్టోబర్ 5నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇకనవంబర్ 19వరకూ క్రికెట్ అభిమానులకు పెద్ద పండుగనే చెప్పాలి. ఇదిలావుండగా, వరల్డ్ కప్ పోటీలు ప్రారంభమైన సందర్భంగా ప్రస్తుతం ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ..
ఇటీవల కాలంలో ఐసీసీ టోర్నీల్లో వర్షం కారణంగా టీమిండియాకు ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే వరుణుడి వల్ల కీలక ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు సరైన ప్రాక్టీస్ లభించలేదు. దీంతో నేరుగా ప్రపంచకప్ బరిలోకి దిగి పటిష్ట ఆస్ట్రేలియాను ఎదుర్కోవాల్సిన పరిస్థితి.
ఐసీసీ ర్యాంకులకు సంబంధించి ఏకకాలంలో టీమిండియా మూడు ఫార్మాట్లలో నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. గతంలో ఈ ఫీట్ దక్షిణాఫ్రికా జట్టు మాత్రమే సాధించింది.
తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మన వాళ్లు దుమ్ములేపారు. ఇటు జట్టు పరంగా, అటు ఆటగాళ్ల పరంగా మన వాళ్లు అదరగొట్టారు.