Home » Jagan
చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ మంత్రి, వైసీపీ ముఖ్య నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పెద్ద షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ ఎస్.అలీంబాషా, మరో 10 మంది కౌన్సిలర్లు గురువారం వైసీపీకి రాజీనామా చేశారు.
రాష్ట్రంలో 108 వాహన సేవలను అరబిందో సంస్థ 2020 జూలై నుంచి నిర్వహిస్తోంది. 2014 నుంచి 2019 మధ్యలో ప్రభుత్వం జనాభాకు సరిపడగా 440 వాహనాలను ప్రవేశపెట్టగా..
‘‘కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తన ఉనికిని నిరూపించుకోవాలి. అప్పుడు ఆయన మళ్లీ పుంజుకునేందుకు అవకాశాలు లేకపోలేదు. కానీ, కేసీఆర్ ఇప్పుడు హరీశ్ రావు ట్రాప్‌లో ఉన్నారు. కేసీఆర్ బతికున్నంత వరకూ హరీశ్ ఆయనను ఏమీ చేయలేరు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ల లాంటి చిరుద్యోగులకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకం మూలంగా చిన్నపాటి ఉద్యోగుల కుటుంబాలు వేదనతో ఉన్నాయని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో జగన్ సర్కారు అచ్చంగా ఇలాగే... అడ్డంగా, నిలువుగా దొరికిపోయింది. ‘ఇసుక అక్రమ తవ్వకాలు ఎక్కడా జరగడంలేదని చెప్పమన్నారండీ’ అన్నట్లుగా జిల్లా కలెక్టర్లందరూ కూడబలుక్కుని ఒకే అబద్ధాన్ని చెప్పేశారు. కాదుకాదు... కలెక్టర్ల చేత జగన్ చెప్పించారు.
‘విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్’ అని ఇప్పటికీ చక్కటి కబుర్లు చెబుతున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో భారీ దోపిడికి తెగబడ్డారు.
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్‌కు లెటర్ రాయడం సిగ్గుచేటని కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం ఎమ్మెల్యే కడపలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదాపై కనీస అవగాహన లేకుండా జగన్ రెడ్డి ప్రతిపక్ష హోదాను కోరడం హేయమైన చర్యగా అభివర్ణించారు.
బాపట్ల జిల్లా: పట్టణంలో వైసీపీ జిల్లా కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకట రమణ పేరుతో నోటీసులు జారీ చేశారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో నోటీసును ఆఫీస్ గోడకు మున్సిపల్ సిబ్బంది అంటించారు. అలాగే సిబ్బంది మోపిదేవికు రిజిస్టర్ పోస్టులో నోటీసులు పంపించారు.
పెండింగ్ బిల్లుల కోసం వైసీపీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న ఆందోళనలతో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పనులు చేసినవారు పులివెందులలో ఆయన సమక్షంలోనే ఆందోళనకు దిగారు.
కడప జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో మండలాల వారీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలతో మూడు రోజుల పాటు నిర్వహించిన సమీక్షా సమావేశాలు సోమవారంతో ముగిసాయి.