Minister Satya Kumar: హత్యా రాజకీయాల కోసమే జగన్ పర్యటన
ABN , Publish Date - Apr 09 , 2025 | 06:15 AM
మంత్రిపదవి నిర్వహిస్తున్న సత్యకుమార్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయన, జగన్ కుటుంబం పద్ధతులపై ఆరోపణలు ముంచారు మరియు ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా జగన్ వ్యవహార శైలిలో మార్పు లేదని చెప్పారు

‘వైఎస్’ ఫ్యామిలీ వందలాది మంది ప్రాణాలు తీసింది: సత్యకుమార్
అనంతపురం, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో దళితుడిని చంపి, డోర్ డెలివరీ చేసిన వారిని వెనకేసుకొచ్చి కాపాడిన సంస్కృతి జగన్‌దే’ అని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. అనంతపురంలో మంగళవా రం ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు నాంది పలికిం ది జగన్ కుటుంబమే. జగన్ ఫ్యామిలీ వందలాది మంది ప్రాణాలు తీసింది. శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన హత్యతో రాజకీయాలు చేయడానికే జగన్ వచ్చారు. తల్లిని, చెల్లిని ఇంటి నుంచి గెంటేసిన జగన్ చరిత్ర అందరికీ తెలుసు. అలజడి, వైషమ్యాలు, విద్వేషాలు సృష్టించేందుకే జగన్ పాపిరెడ్డిపల్లికి వచ్చారు. ఎన్నికల్లో 11 సీట్లతో ప్రజలు గట్టి గుణపాఠం చెప్పినా జగన్ వ్యవహార శైలిలో మార్పు రాలేదు’ అని సత్యకుమార్ విమర్శించారు.