BJP State President Purandeswari: వక్ఫ్‌బిల్లుపై వైసీపీ డ్రామా
ABN , Publish Date - Apr 06 , 2025 | 03:23 AM
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ చేసినప్పటికీ ముస్లింల మతపరమైన స్వేచ్ఛపై ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశారు. ఆమె అన్నారు, మైనార్టీల అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది, కానీ కాంగ్రెస్ మరియు వైసీపీ వంటి పార్టీలు ఓట్లు కోసం డ్రామాలు చేసేవి

ముస్లింల మతపరమైన స్వేచ్ఛలో కేంద్రం తలదూర్చలేదు
కాంగ్రెస్‌ది రాజకీయం: పురందేశ్వరి
బాబూ జగ్జీవన్‌రామ్‌కు బీజేపీ అధ్యక్షురాలి నివాళి
అమరావతి, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుని కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డులో మాత్రమే సవరణ చేసిందని, ముస్లింల మతపరమైన స్వేచ్ఛలో తలదూర్చలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. అల్లా మీద విశ్వాసంతో దాతలిచ్చే భూమి వక్ఫ్ అవుతుందని, ఆ భూమిని సక్రమంగా వినియోగిస్తే మైనార్టీల ఇబ్బందులు దూరం చేయవచ్చని అన్నారు. విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సామాజిక సమానత్వం కోసం జీవితకాలం పోరాటం చేసిన జగ్జీవన్ రామ్ బడుగుల అభ్యున్నతి కోసం కృషి చేశారని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన వివక్షను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే ట్రిపుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370, పౌరసత్వ బిల్లు, వక్ఫ్ సవరణ చేసిందని వ్యాఖ్యానించారు.
దేశంలోని అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలంటూ జేపీసీకి రిఫర్ చేసిన కేంద్ర ప్రభుత్వం 92 లక్షలకు పైగా వినతులు పరిశీలించి 25రాష్ట్రాల్లోని వక్ఫ్ బోర్డులతోపాటు 1.25కోట్ల అభిప్రాయాలు తీసుకుని చేసిన సిఫారసులకు అనుగుణంగా సవరణ చేసిందని వివరించారు. ఇవేవీ అర్థం చేసుకోండా సోనియా, రాహుల్, ప్రియాంక చర్చలో పాల్గొనకుండా మతపరమైన అంశంపై అవాకులు, చవాకులు పేలుతూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్, వైసీపీ లాంటి పార్టీలు డ్రామాలాడుతుంటే మైనార్టీల అభివృద్ధి, ఆ వర్గాల్లోని మహిళల హక్కుల కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. పార్లమెంటులో బిల్లును వ్యతిరేకించిన వైసీపీ ఆ తర్వాత రాజ్యసభలో మద్దతివ్వడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా పురందేశ్వరి అభివర్ణించారు.
ఇవి కూడా చదవండి
YSRCP Leaders Cruelty: వైసీపీ నేతల అరాచకం.. కన్నీరు పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో
Tiruvuru Politics: తిరువూరులో రసవత్తరంగా రాజకీయం
Read Latest AP News And Telugu News