Home » Khammam
ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. సోమవారం జరిగే పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ తరఫున గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకే్‌షరెడ్డి సహా 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
దేశంలోనే ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందుకు అనుగుణంగా ఏటా లక్ష నుంచి 2లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగును పెంచేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు.
మూడు ఉమ్మడి జిల్లాలు.. ఐదు లోక్‌సభ నియోజకవర్గాలు.. 35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న శాసనమండలి స్థానం. 4,63,839 మంది పట్టభద్రులైన ఓటర్లకు 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన నియోజకవర్గం.
వరంగల్-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకే తమ మద్దతు అని తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో శుక్రవారం తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు.
రాజకీయాల్లో విజయం, అధికారం ఎప్పుడూ ఏ ఒక్కరి సొత్తూ కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజాతీర్పుకు కట్టుబడి సుపరిపాలన అందించాలని సూచించారు. ప్రతిపక్షం ఉంటేనే ప్రజలకు సుపరిపాలన అందుతుందన్నారు.
Telangana: ఈనెల 27న ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని... బీజేపీ అభ్యర్థిగా 40 ఏళ్లుగా సిద్ధాంతాన్ని నమ్ముకుని ఎత్తిన జెండా దింపని గుజ్జుల ప్రేమెందర్ రెడ్డిని ఎమ్మెల్సీ బరిలో నిలిపామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ఆనాడే ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించినా నేటికీ అమలు చేయకపోవడం పట్ల వారు బాధతో ఉన్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు చెల్లింపు విధానంతో మళ్ళీ ఆర్టీసీని దివాలా తీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మరోసారి సందడి చేశారు. కేసులతో బిజీగా ఉన్న ఆయన రిలాక్స్‌గా తెలుగు పాటలకు మాస్ స్టెప్లేసి ఆదరగొట్టారు. ఎస్పీ డ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Telangana: ‘‘గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి నా గెలుపు కోసం శ్రమించి పనిచేసి అద్భుతమైన మెజారిటీతో గెలిపించారు. మీ ఇంటి పెద్దకొడుకుగా మీ అందరి కోసం పనిచేస్తా’’ అని రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో నిర్వహించిన ప్రజల వద్దకె శ్రీనన్న కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ..
రాష్ట్రంలో నిరుపేదలకు వైద్య పరీక్షల భారాన్ని తగ్గించేందుకు ఏర్పాటైన తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్‌లకు జబ్బు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వీటి పనితీరు అస్తవ్యస్తంగా మారింది. వీటిలో పనిచేసేందుకు తగినంత మంది రెగ్యులర్ సిబ్బంది లేకపోవడం ఒక సమస్య అయితే, ఉన్నవారికి సక్రమంగా వేతనాలు ఇవ్వకపోవడం మరో సమస్యగా ఉంది. ప్రస్తుతం ఈ హబ్‌లలో పనిచేస్తున్న సిబ్బందికి ఐదారు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో.. కొందరు ఉద్యోగాలు వదిలేస్తున్నారు. వైద్యులు సైతం ఇదే బాట పడుతున్నారు.
హనుమకొండ: ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చరిత్రాత్మకమని, 35 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ప్రజాప్రతినిధులు లేరని, అయినా కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసిందని వరంగల్-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు.