Share News

Ponguleti Srinivasreddy: ఈ ఐదేళ్లు ప్రజలకు సేవ చేస్తా.. పాలేరే నా సొంత ఇల్లు

ABN , Publish Date - May 20 , 2024 | 10:37 AM

Telangana: ‘‘గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి నా గెలుపు కోసం శ్రమించి పనిచేసి అద్భుతమైన మెజారిటీతో గెలిపించారు. మీ ఇంటి పెద్దకొడుకుగా మీ అందరి కోసం పనిచేస్తా’’ అని రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో నిర్వహించిన ప్రజల వద్దకె శ్రీనన్న కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ..

Ponguleti Srinivasreddy: ఈ ఐదేళ్లు ప్రజలకు సేవ చేస్తా.. పాలేరే నా సొంత ఇల్లు
Minister Ponguleti Srinivas Reddy

ఖమ్మం, మే 20: ‘‘గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి నా గెలుపు కోసం శ్రమించి పనిచేసి అద్భుతమైన మెజారిటీతో గెలిపించారు. మీ ఇంటి పెద్దకొడుకుగా మీ అందరి కోసం పనిచేస్తా’’ అని రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. సోమవారం నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో నిర్వహించిన ప్రజల వద్దకె శ్రీనన్న కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రఘురాం రెడ్డి గెలుపు కోసం కూడా అందరూ కృషి చేశారన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ప్రచారం లేకుండానే ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పేదలకు ఒక్క ఇళ్ళు కూడా ఇవ్వలేదని విమర్శించారు. పాలేరు నియోజకవర్గం తన సొంత ఇల్లు అని తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాల్లో పాలేరు నియోజకవర్గంలో ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం.. బతికున్న ఆనవాళ్లు లేవన్న రిపోర్ట్స్


పార్టీలకు అతీతంగా పేద వాళ్లలో అతి పెదవాళ్ళకి ఇళ్ళు ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పాలేరులో ఏ ఒక్కరూ మంచినీటికి ఇబ్బంది పడకుండా చర్యలు చేపడతామన్నారు. పాలేరు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు నిర్మాణం చేస్తామని చెప్పారు. గత పది సంవత్సరాలుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. నిజమైన పేదవారికి సేవ చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. వైద్యం, విద్యకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. పాలేరు ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పోగొట్టుకోనన్నారు. ఎన్నికలు ఉన్నా.. లేకపోయినా నిత్యం పాలేరు ప్రజల మధ్యే ఉంటానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

AP Poll Violence: ఏపీలో అల్లర్లపై సిద్ధమైన సిట్ ప్రాథమిక నివేదిక

Ebrahim Raisi: హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసీ మృతి.. ధృవీకరించిన స్థానిక మీడియా

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 20 , 2024 | 10:46 AM