Home » Kishan Reddy G
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆర్టికల్ 370 రద్దు కోసం పట్టుపట్టారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. ఓకే దేశం ఒకే జెండా ఒకే రాజ్యాంగం ఉండాలని కోరుకున్నారని తెలిపారు.
నీట్‌ను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని, అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో బర్కత్‌పురలోని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి ఇంటిని ముట్టడికి యత్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణిలో జరిగిన ఆర్థిక విధ్వంసం, దోపిడీ, రాజకీయ జోక్యంపై న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా రెండోసారి సాధించిన విజయాన్ని పార్టీ కార్యకర్తలకు ప్రజలకు అంకితం చేస్తున్నానని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి(Minister G Kishan Reddy) అన్నారు.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి.. ఆ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షులు కిషన్‌రెడ్డి(Kishan Reddy)ని కేంద్రమంత్రివర్గంలో తీసుకోవడంతో తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని నియమిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో ఇటీవల ఆ పార్టీ నుంచి గెలిచిన 8మంది ఎంపీల్లో ఇద్దరిని కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారు.
మనిషి జీవితంలో యోగా ఓ మంచి డాక్టర్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నిత్యం యోగా సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిజాం కళాశాల మైదానంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
నీట్, నెట్ ప్రశ్నపత్రాలు లీక్ కావడంపై విద్యార్థి, యువజన సంఘాలు మండిపడ్డాయి. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలు, యూనివర్సిటీల్లో ఆందోళనలు నిర్వహించాయి. నీట్ పరీక్షను రద్దు చేసి.. తిరిగి నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి.
తెలంగాణ బిడ్డగా సింగరేణికి అన్యాయం చేయబోనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి భవిష్యత్తు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుందని సింగరేణిపై తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా కేంద్రానికి కూడా బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు.
రద్దయిన ఐటీఐఆర్‌ను తిరిగి తెప్పించాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులుగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లపైనే ఉందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ను మంజూరు చేస్తే.. ఆ తర్వాత వచ్చిన మోదీ సర్కారు దాన్ని రద్దు చేసిందని ఆయన గుర్తు చేశారు.
కోల్ ఇండియా లిమిటెడ్‌కు ఇచ్చిన ప్రాధ్యనతనే సింగరేణికి కేంద్రం ఇస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సింగరేణి కేంద్రం ఆదుకొనే విధంగా ప్రణాళికలు చేస్తామని తెలిపారు.