Kishan Reddy: సింగరేణికి కేంద్రం ప్రాధాన్యం ఇస్తోంది.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 21 , 2024 | 03:52 PM
కోల్ ఇండియా లిమిటెడ్‌కు ఇచ్చిన ప్రాధ్యనతనే సింగరేణికి కేంద్రం ఇస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సింగరేణి కేంద్రం ఆదుకొనే విధంగా ప్రణాళికలు చేస్తామని తెలిపారు.
హైదరాబాద్: కోల్ ఇండియా లిమిటెడ్‌కు ఇచ్చిన ప్రాధ్యనతనే సింగరేణికి కేంద్రం ఇస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సింగరేణి కేంద్రం ఆదుకొనే విధంగా ప్రణాళికలు చేస్తామని తెలిపారు. రెండు మైన్లు కేంద్రం దృష్టిలో ఉన్నాయని.. ఒడిస్సా నైనీ ప్రాజెక్టుపై త్వరలో నిర్ణయం ఉంటుందని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఒకే పాలసీ కేంద్రం అమలు చేస్తోందని అన్నారు.
సింగరేణిలో కొన్ని సమస్యలు ఉన్నాయి..వాటిని అధిగమిస్తామని వివరించారు. సింగరేణి విషయంలో పార్టీలు రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. రెండు మూడు రోజుల్లో సింగరేణిపై మరింత స్పష్టత ఇస్తామని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు పొంతన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా ఉన్న పాలసీనే తెలంగాణలో అమలు అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఆక్షన్ అనేది ఓపెన్...సింగరేణి మాత్రమే కాదు ఎవరైనా బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చని కిషన్‌రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Telangana: పోచారంపై షాకింగ్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి..
Bhatti Vikramarka: తెలంగాణ బొగ్గు బ్లాక్‌లను ప్రైవేట్ సంస్థలకు కేటాయించటం బాధాకరం