Home » Lawyer
మణిపూర్ హింసపై భారత ప్రధాన న్యాయమూర్తి , సుప్రీంకోర్టుపై చేసిన వ్యాఖ్యలకు గాను చెన్నైకి చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, పబ్లిషర్ బద్రి శేషాద్రిని పోలీసులు శనివారంనాడు అరెస్టు చేశారు.
వాదనా పటిమతో న్యాయాన్ని గెలిపించవలసిన న్యాయవాదులు హింసాత్మక చర్యలకు పాల్పడటం ఆందోళనకరం. ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో బుధవారం న్యాయవాదుల మధ్య ఘర్షణ కాల్పుల వరకు వెళ్లింది. కోర్టు ఆఫీస్ బేరర్లు కూడా ఈ ఘర్షణలో పాల్గొన్నారు. అయితే గాలిలోకి కాల్పులు జరపడం వల్ల అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం సంభవించలేదు.
అవినాష్.. అవినాష్.. అటు ఏపీలో ఇటు తెలంగాణలో ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది.. కనిపిస్తోంది..! విచారణకు రావాల్సిందేనని సీబీఐ.. రాకుండా ప్రతిసారీ ఎంపీ డుమ్మాకొడుతుండగా ఈ ఎంక్వయిరీ ఎపిసోడ్కు ఇప్పట్లో ఫుల్స్టాప్ పడే పరిస్థితులు కనిపించట్లేదు.
లీగల్ రంగంలో కీలక పరిణామానికి తెరలేచింది. ఇండియాలో ఫారెన్ లాను ప్రాక్టీస్ చేసేందుకు విదేశీ లాయర్లు, న్యాయ సంస్థలకు అనుమతిస్తూ
సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన మంచి పని ద్వారా లాయర్ల (lawyers) మనస్సులో ఒక స్థానం అన్నది ఏర్పడితే.. వాళ్లు పేదవాళ్లకు ట్రాన్స్ఫర్ చేయగలుగుతారని సీఎం అన్నారు.
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (National Education Policy) (ఎన్ఈపీ)ని అనుసరించి యూనివర్సిటీలు మొదలుకుని పేరెన్నికగన్న ఉన్నత విద్యా సంస్థలు సరికొత్త కోర్సులకు
"జడ్జిగారూ! న్యాయమూర్తిగా రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారా?" ఖంగుమన్న ఆయన గొంతుకు జడ్జితో పాటు యావత్ కోర్టు హాలు స్థాణువై నిశ్శబ్దమయ్యింది. "మీ మాటలు కోర్టు ధిక్కారమని మీకు అర్థమౌతోందా?" తేరుకున్న జడ్జి ఆ న్యాయవాది వైపు చూసి ఉరిమారు.