Home » Mangalagiri
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అధికారపక్షం ఏదోరకంగా అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది.
అమరావతి: తనపై అసత్య ప్రచారం చేసినవారిపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ న్యాయపోరాటం చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్లో భారీ స్కామ్ జరిగిందని మాజీ ఛైర్మన్ అజయ్ రెడ్డి చేసిన ఆరోపణలపై లోకేష్ పరువునష్టం దావా వేశారు.
తనపై వచ్చిన అసత్య ఆరోపణలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ న్యాయపోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు (శుక్రవారం) ఉదయం లోకేశ్ మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్.. సాక్షి, అజయ్ రెడ్డిపై మరో న్యాయ పోరాటం చేస్తున్నారు. అసత్య కథనాలపై క్రిమినల్ కేసులు పెట్టారు. శుక్రవారం లోకేష్ మంగళగిరి కోర్టులో హాజరై వాంగ్మూలం ఇవ్వనున్నారు.
గుంటూరు జిల్లా: వైసీపీ అసత్య ప్రచారంపై టీడీపీ యువనేత నారా లోకేష్ న్యాయపోరాటం ప్రారంభించారు. ఏపీ అటవీ, అభివృద్ధి సంస్థ ఛైర్మన్, ఏపీ చీఫ్ డిజిటల్ డైరెక్టర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, వైసీసీ ఎమ్మెల్సీ పోతుల సునీతపై క్రిమినల్ కేసులు దాఖలు చేశారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. నిస్వార్ధంగా కష్టపడితే అధికారం దానంతటదే వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్ని వర్గాల వారికి వంగవీటి మోహనరంగా అండగా నిలిచారని ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ తెలిపారు. పాతురులో రంగా విగ్రహావిష్కరణలో రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. పాతూరులో తన తండ్రి, పెదనాన్న విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ విగ్రహాలకు ఎమ్మెల్యే ఆర్కే సహకారం అందించారని వెల్లడించారు. ఒక నాయకుడు మరణించి మూడు దశాబ్దాలు దాటినా స్మరిస్తూనే ఉన్నారని.. తనది మానవ కులం అని చాటి చెప్పిన వ్యక్తి వంగవీటి మోహనరంగా అని గుర్తుచేశారు.
వంగవీటి మోహనరంగా పేదల కోసం జీవితం త్యాగం చేశారని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. పాతూరులో వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే, వంగవీటి రాధాకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు గంజి చిరంజీవి, మురుగుడు హనుమంతరావు, జనసేన నుంచి చిల్లపల్లి శ్రీనివాసరావు, పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడారు. వంగవీటి మోహనరంగా పేదల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశారని గుర్తుచేశారు. అటువంటి మహనీయులు అందరికీ ఆదర్శనీయం అని తెలిపారు.
ఏకలవ్యుడు అంటే గుర్తు వచ్చేది మహా భారతం. బొటనవేలును త్యాగం చేసిన వ్యక్తి ఏకలవ్యుడు. ఎరుకుల సామాజికవర్గానికి న్యాయం చేసింది టీడీపీనే. వైసీపీ ప్రభుత్వంలో పేదలకు అన్యాయం జరుగుతుంది. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎరుకుల కులస్తులకు న్యాయం చేస్తా
అమరావతి: మాలల్లో వచ్చిన చైతన్యంతో రాష్ట్రానికి పట్టిన శని వదులుతుందని నమ్ముతున్నానని, ఇందిర, వైఎస్, జగన్ వెంటే మాలలు ఉన్నారనే ప్రచారానికి మీరే చెక్ పెట్టాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపిచ్చారు.