Home » Medical News
ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రం నుంచి నీట్ రాసిన విద్యార్థుల ర్యాంకులను ప్రకటించింది. తెలంగాణ నుంచి ఈ దఫా 49,184 మంది క్వాలిఫై అయునట్లు గుర్తించింది.
రాష్ట్రంలో నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా పలు పీజీ కోర్సుల ప్రారంభానికి జాతీయ వైద్య మండలి అనుమతులు మంజూరు చేసింది. ఈమేరకు శుక్రవారం లెటర్ ఆఫ్ పర్మిషన్ను ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు పంపింది.
ఉస్మానియా ఆస్పత్రిపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రి కోసం కొత్త భవనాన్ని గోషామహల్ పోలీస్ క్వార్టర్స్ స్థలంలో, 30 ఎకరాల వైశాల్యంలో నిర్మిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం శాసనసభలో ప్రకటించారు.
రాష్ట్రంలో వైద్య విద్య మరింత మందికి చేరువ కానుంది. తెలంగాణలో నాలుగు కొత్త వైద్య కళాశాలలకు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) అనుమతులిచ్చింది. ఇందుకు సంబంధించి ఎల్వోపీ(లెటర్ ఆఫ్ పర్మిషన్)ను బుధవారం రాత్రి జారీ చేసింది.
ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం నిర్మాణం అంశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
వైద్య విద్య సంచాలకుడి పరిఽధిలో విభాగాధిపతి(అడ్మినిస్ట్రేటివ్) పోస్టుల వయో పరిమితి పెంపు బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సంబంధిత ఫైల్‌పై ఇంచార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆదివారం సంతకం చేసినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సోకడంతో.. గర్భసంచి తొలగింపు కోసం వచ్చిన యువతికి వైద్యులు కొత్త భరోసా ఇచ్చారు! గర్భసంచి తొలగించకుండానే క్యాన్సర్‌కు చికిత్స చేయడమే కాక.. ఆమె మళ్లీ మాతృత్వ మధురిమను పొందేలా చేశారు. హైదరాబాద్‌లోని కొండాపూర్ కిమ్స్ కడల్స్ ఆస్పత్రి వైద్యుల ఘనత ఇది.
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో బదిలీల్లో ఎవరికీ మినహాయింపు ఇవ్వలేదు. ఆఫీస్ బేరర్ అంటూ లేఖలు తెచ్చుకుని బదిలీల నుంచి మినహాయింపు పొందిన వారందర్నీ.. ఆఖరికి యూనియన్ నేతలను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది.
రాష్ట్రంలో వైద్య విద్య కళాశాలలకు ప్రిన్సిపాళ్లు, అనుబంధ ఆస్పత్రులకు సూపరింటెండెంట్లు దొరకడం కష్టమవుతోంది. విభాగాధిపతి(అడ్మినిస్ట్రేటివ్) పోస్టులైన వీటి కి.. వయో పరిమితి పెంపు బిల్లును గత ఏడాది ఏప్రిల్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి గవర్నర్ డాక్టర్ తమిళిసైకు పంపగా ఆమె తిరస్కరించారు.
ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే రోగుల పట్ల డాక్టర్లు, సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మాటలతోనే రోగులకు సగం రోగం తగ్గిపోవాలని సూచించారు.