Home » NCP
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన సంక్షోభం పతాక స్థాయికి చేరుకుంది. అజిత్ పవార్ ఎన్‌సీపీ కొత్త అధ్యక్షుడని ఆయన వర్గం బుధవారంనాడు ప్రకటించింది. జూన్ 30వ తేదీనే శరద్ పవార్‌ను పార్టీ చీఫ్ పదవి నుంచి తొలగించినట్టు ఎన్‌సీపీ తిరుగుబాటు వర్గం నేత సునీల్ టట్కరే తెలిపారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గుర్తు తమతోనే ఉందని, ఎక్కడికీ పోలేదని ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. తమను అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు తమవెంటే ఉన్నారని తెలిపారు. ముంబైలోని వైబీ చవాన్ సెంటర్‌లో బుధవారంనాడు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల సమావేశంలో పవార్ మాట్లాడారు.
మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన కల్లోలం మరో మలుపు తిరిగింది.తనకు 35 మంది ఎమ్మెల్యేల బలం ఉందంటూ అజిత్ పవార్ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. నిజమైన ఎన్‌సీపీ, ఆ పార్టీ గుర్తు తమదేనని ఈసీకి దాఖలు చేసిన పిటిషన్‌లో అజిత్ పవార్ క్లెయిమ్ చేశారు.
పవార్‌ల మధ్య పవర్ గేమ్‌లో ఆసక్తికర సంఘటనలు జరుగుతున్నాయి. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌పై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గతంలో జరిగిన అంతర్గత విషయాలను బహిర్గతం చేస్తూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2019లో బీజేపీ, శివసేన విడిపోయినపుడు ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీతో ఎన్‌సీపీ ఐదు సమావేశాలను నిర్వహించిందని చెప్పారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. ఎన్‌సీపీని చీల్చి, అజిత్ పవార్ (Ajit Pawar) వర్గం బీజేపీ-శివసేన కూటమిలో చేరడంతో తమకు ప్రాధాన్యం తగ్గుతుందని వీరు అభిప్రాయపడుతున్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చీలిక రావడంతో మహారాష్ట్రలో అభివృద్ధి చెందడానికి ఇదే సరైన సమయమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కష్టాల్లో ఉన్న శరద్ పవార్ (Sharad Pawar)కు సంఘీభావం ప్రకటిస్తూనే, తమ పార్టీని విస్తరించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాలని చెప్తున్నారు.
మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే (Raj Thackeray) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలో ‘పవార్’ గేమ్‌లో కీలక ఘట్టం బుధవారం కనిపించబోతోంది. ఎన్సీపీలోని శరద్ పవార్, అజిత్ పవార్ బలాబలాలు తేలిపోబోతున్నాయి. అధికార పక్షంతో చేతులు కలిపిన అజిత్ పవార్‌తోపాటు, మరాఠా రాజకీయ దిగ్గజం శరద్ పవార్ కూడా ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇరువురి మద్దతుదారులు తమ నేత ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతున్నారు.
అజిత్ పవార్ తిరుగుబాటు వర్గం తన ఫోటో వాడుకోవడంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ సీరియస్ అయ్యారు. తన అనుమతి లేకుండా తన ఫోటో వాడుకోరాదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సంక్షోభం మరింత ముదురుతోంది. అజిత్ పవార్ తిరుగుబాటుతో పార్టీ పునర్మిర్మాణానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పట్టుదలతో ఉండగా, పార్టీ ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నందున తనదే అసలైన ఎన్సీపీ పార్టీ అంటూ అజిత్ పవార్ అడ్డం తిరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరు నేతలూ ఎన్సీపీ సమావేశానికి పులుపునిచ్చారు.