Home » NEET Paper Leak 2024
వాయిదా పడ్డ నీట్-పీజీ పరీక్షను ఆగస్టు 11న నిర్వహించనున్నట్టు ‘నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎ్‌స)’ శుక్రవారం ప్రకటించింది.
నీట్ యూజీ పరీక్షను రద్దు చేయొద్దని.. అలా చేస్తే నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.
నీట్ యూజీ 2024 పరీక్షను(NEET UG 2024) పూర్తిగా రద్దు చేయడం వల్ల పరీక్ష రాసిన లక్షలాది మంది నిజాయతీపరులకు అన్యాయం జరుగుతుందని.. కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై(NEET Paper Leakage) సమగ్ర విచారణ జరిపించాలని సీబీఐని ఆదేశించినట్లు చెప్పింది.
పేపర్ లీక్(NEET Paper Leakage) అయి వాయిదాపడ్డ నీట్ పీజీ ప్రవేశ పరీక్ష కొత్త తేదీలను ప్రకటించారు. శుక్రవారం షెడ్యూల్ రిలీజ్ చేశారు. నీట్ పీజీ పరీక్ష రద్దయిన దాదాపు 13 రోజుల తర్వాత నేషనల్ ఎలిజిబిబిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(NEET) పీజీ ఎగ్జా్మ్స్ కొత్త తేదీలను ప్రకటించింది.
Andhrapradesh: నగరంలోని మొగల్రాజపురం సిద్ధార్థ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీట్, నెట్ పేపర్ లీకేజ్‌కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు గురువారం నిరసన చేపట్టాయి. ఎస్ఎఫ్ఐ, పిడిఎస్‌యూ, వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ..
నీట్ అక్రమాలకు నిరసనగా విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యచరణ సమితి ఈనెల 4న విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది.
నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పి తిరిగి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఛలోరాజ్‌భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది.
Telangana: విద్యార్థి, యువజన సంఘాల నేతల రాజ్‌భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థి, యువజన ఐక్య కమిటీ ఆధ్వర్యంలో గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారు. అయితే అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు గవర్నర్ నిరాకరించడంతో రాజ్‌భవన్ ముట్టడికి నేతలు బయలు దేరారు.
రెండు రోజుల విరామం తర్వాత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 24వ తేదీన లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగా.. మొదటి రెండు రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం జరిగింది. మూడో రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది.
కొన్ని రోజుల పార్లమెంటు సమావేశాలు సోమవారం(జులై 1) తిరిగి ప్రారంభమవుతున్నాయి. సభలో బలమైన ప్రతిపక్షం ఉండటం.. ఎన్డీయే(NDA) సర్కార్‌కి తలనొప్పిగా మారింది. నీట్ పేపర్ లీకేజీ(NEET Paper Leakage), అగ్నిపథ్ పథకంలో మార్పులు, నిరుద్యోగం తదితర అంశాలపై సభలో చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.