Home » NRI News
కిర్గిజిస్థాన్(Kyrgyzstan) రాజధాని బిష్కెక్(Bishkek)లో మెడిసిన్ చదువుతున్న పాకిస్థాన్, భారత్‌కు చెందిన విద్యార్థులపై దాడి(Violence) జరిగినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. పాకిస్థానీ, భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని అంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రైతులు క్రాఫ్ హాలీడే ప్రకటించినట్టు.. రాష్ట్రాభివృద్ధికి కూడా విరామం ప్రకటించినట్లుగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఉందని ఎన్నారై కొల్లా అశోక్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు రాష్ట్రం పురోగామి దిశగా దూసుకు వెళ్లితే.. నేడు తిరోగమన దిశలో ఉందన్నారు.
భారతీయులు లేకుండా అమెరికా(America) సాంకేతిక పరిశ్రమ(Tech Industry) మనుగడ కష్టమని సిలికాన్ వ్యాలీ సెంట్రల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ CEO హర్బీర్ కె భాటియా అభిప్రాయం వ్యక్తం చేశారు. సిలికాన్ వ్యాలీలో ఇన్నోవేషన్స్, కీలక నేతల్లో భారతీయులు కూడా ఉన్నారని పేర్కొన్నారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు చైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని తానా కార్యదర్శి రాజా కసుకుర్తి గురువారం తెలిపారు.
భారీ వర్షాలు యూఏఈని(UAE) అతలాకుతలం చేసిన నేపథ్యంలో ఈ వర్షాల(Heavy Rains) కారణంగా ప్రభావితమైన భారతీయుల(Indians) సహాయార్ధం దుబాయ్‌లోని(Dubai) భారతీయ రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది.
ఒకప్పుడు ఢిల్లీలోని ప్రముఖ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS) నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసిన భారత సంతతికి చెందిన వ్యక్తి ఇప్పుడు ప్రముఖ టైం మ్యాగజైన్లో చోటు దక్కించుకున్నారు. అంతేకాదు బ్లాక్ హోల్స్ ఎలా ఏర్పడతాయి, అవి ఎలా పెరుగుతాయి, అవి పరిసరాలను ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాలపై కూడా దృష్టి సారించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
వలసల సంఖ్యను తగ్గించడానికి బ్రిటిష్ ప్రభుత్వం(british government) తీసుకున్న కీలక నిర్ణయం నిన్నటి నుంచి అమల్లోకి రాగా, ఇది భారతీయులపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. కుటుంబ వీసాపై ఈ దేశానికి రావాలనుకునే పౌరులకు(immigration standards) అవసరమైన కనీస ఆదాయాన్ని బ్రిటన్ 55 శాతం పెంచింది.
తైవాన్‌లోని హ్సించు నగరంలో తెలుగు వారంతా కలిసి తైవాన్ తెలుగు సంఘం (TTA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, కొత్త స్నేహితులతో ఉల్లాసంగా సాగిన ఈ కార్యక్రమంలో సాంప్రదాయ ఉగాది పచ్చడితోపాటు నోరూరించే వంటకాలను నిర్వాహకులు అందించారు.
అగ్రరాజ్యం అమెరికా(america)లో మరో భారతీయ విద్యార్థి మృతి(Indian student dies) చెందిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్(New York)లోని భారత కాన్సులేట్ శుక్రవారం ఓహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో ఉన్న ఉమా సత్యసాయి గద్దె(Uma Satya Sai Gadde) అనే భారతీయ విద్యార్థి మరణించినట్లు తెలిపింది.
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (TPAD) వార్షికోత్సవాన్ని రక్తదాన శిబిరంతో ప్రారంభించాయి. టీపీఏడీ ఏర్పడినప్పటి నుంచి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. గత మూడేళ్ల నుంచి ఏడాదికి రెండుసార్లు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇది 13వ రక్తదాన శిబిరం అని నిర్వహకులు తెలిపారు.