Sudiksha Konanki Missing: డొమినికన్ బీచ్‌లో చెక్కుచెదరకుండా లభ్యమైన సుదీక్ష దుస్తులు.. అదృశ్యం వెనక ఉన్నది వీళ్లేనా..
ABN , Publish Date - Mar 16 , 2025 | 04:53 PM
Sudiksha Konanki Missing: భారతసంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి అదృశ్య కేసులో పోలీసులు కీలక ఆధారం గుర్తించారు. మిస్టరీగా మారిన ఈ కేసులో తెలుగమ్మాయి చివరిసారిగా ధరించిన దుస్తులు డొమినికన్ బీచ్ వద్ద చెక్కుచెదరకుండా కనిపించడంతో..

Sudiksha Konanki Missing: పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న భారతసంతతి విద్యార్థిని (Indian Origin Student Missing) సుదీక్ష కోణంకి మిస్సింగ్ కేసులో మరో కీలక సమాచారం లభ్యమైంది. డొమినికన్ రిపబ్లిక్ (Dominican Republic) బీచ్‌లో మార్చి 6 న అదృశ్యమైనప్పటి నుంచి ఈ మిస్టరీని ఛేదించేందుకు వారం నుంచి పోలీసులు శతావిధాలా ప్రయత్నిస్తున్నారు. కరీబియన్ దేశంలో మార్చి 6 న తప్పిపోయిన క్షణం నుంచి పోలీసులు ఆమె కోసం గాలిస్తూనే ఉన్నారు. తాజాగా డొమినికన్ బీచ్ వద్ద ఆమె చివరిసారిగా ధరించిన గోధుమరంగు దుస్తులు లభ్యమయ్యాయి. లాంజ్ చైర్‌పై కనిపించిన సుదీక్ష బట్టలు చెక్కుచెదరకుండా కనిపించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సముద్రంలో మునిగిపోయిందా..?
వర్జీనియాకు చెందిన 20 ఏళ్ల కోనంకి పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో చదువుతోంది. ఇటీవల సెలవుల్లో వెకేషన్ కోసం 5 గురు స్నేహితురాళ్లతో కలిసి డొమినికన్ రిపబ్లిక్‌లోని ప్యూంటా కానా వెళ్లింది. అయితే, మార్చి 6న రిసార్టులో పార్టీ తర్వాత తెల్లవారుజామున 3 గంటల హఠాత్తుగా సుదీక్ష కనిపించకపోవడంతో ఆమె స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించినప్పుడు.. ఆమె తెల్లవారుజామున 4:15 గంటల సమయంలో మిన్నెసోటాలోని సెయింట్ క్లౌడ్ స్టేట్ యూనివర్సిటీలో సీనియర్ స్టూడెంట్ అయిన 22 ఏళ్ల జాషువా రీబేతో కలిసి వెళ్తున్నట్లు రికార్డయ్యింది. దీని ఆధారంగా పోలీసులు జాషువాను ప్రశ్నించినా అతడు నాకేం తెలియదంటూ సమాధానమిస్తున్నాడు. అదృశ్యమైన రోజు సుదీక్ష ధరించిన దుస్తులే తాజాగా పోలీసులకు బీచ్ వద్ద మట్టిలో కూరుకుపోయి కనిపించాయి. కాగా, ఆమె సముద్రంలో పడి మునిగిపోయి ఉండవచ్చన పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఇది ఫౌల్ కేసు కూడా అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
మిస్సింగ్ వెనక ఉన్నదెవరు..?
సుదీక్ష మిస్సింగ్ కేసులో పోలీసులు చెబుతున్న కారణాలు ఆమె తల్లిదండ్రులు నమ్మడం లేదు. ఇది కిడ్నాప్ కేసు అయి ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు. తమ కూతురు ఎల్లప్పుడూ ఫోన్ వెంటే ఉంచుకుంటుందని.. ఇందుకు భిన్నంగా వాలెట్, ఫోన్ స్నేహితుల దగ్గర వదిలి వెళ్లడం అసాధారణంగా అనిపిస్తోందని అంటున్నారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశారు. డ్రోన్, ఏఐ టెక్నాలజీ సముద్రాన్ని స్కాన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇంటర్‌పోల్ 'ఎల్లో నోటీసు' జారీ చేసింది. దర్యాప్తులో FBI, DEA మరియు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీతో కలిసి పనిచేస్తున్నట్లు పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయం తెలిపింది.
Read Also : SpaceX Crew 10: మరికొన్ని రోజుల్లో భూమిపైకి సునీతా విలియమ్స్..స్పేస్ఎక్స్ డాకింగ్ సక్సెస్..
US Strikes: నరకం చూపిస్తా.. హౌతీలకు ట్రంప్ వార్నింగ్
Terrorist Killed: ముంబై దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సన్నిహితుడు హతం