Share News

TDP Formation Day:ఫిలడెల్ఫియాలో ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకలు.. పాల్గొన్న ప్రముఖలు

ABN , Publish Date - Mar 31 , 2025 | 09:18 PM

NRI TDP:ఫిలడెల్ఫియాలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. దివంగత నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు.

TDP Formation Day:ఫిలడెల్ఫియాలో  ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకలు.. పాల్గొన్న ప్రముఖలు
NRI TDP

శతపురుషుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పెన్సిల్వేనియా రాష్ట్రంలో, ఫిలడెల్ఫియా ప్రాంతంలోని వ్యాలీ ఫోర్జ్ నేషనల్ హిస్టారికల్ పార్క్ లోని చారిత్రాత్మక కట్టడం నేషనల్ మెమోరియల్ ఆర్చ్ ప్రాంగణంలో మార్చ్ 29వ తేదీన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.


TDP-Anniversary.jpg

ఈ వేడుకను పురస్కరించుకుని పలువురు రాష్ట్ర టీడీపీ నాయకులు ఎన్టీఆర్ సేవలను కొనియాడుతూ, నవ్యాంధ్ర నిర్మాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. ఎందరో నాయకులకు స్ఫూర్తి ప్రధాత చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో మనమందరం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.


ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలదండేసి, కేక్ కట్ చేసి ఫిలడెల్ఫియా ఎన్నారై టీడీపీ సభ్యులు తెలుగు దేశం పార్టీపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ వేడుకలో మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి, ఆమదాలవలస శాసన సభ్యులు కూన రవికుమార్, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్, ఫిలడెల్ఫియా ఎన్నారై టీడీపీ నాయకులు పాల్గొని జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు.

TDP-Anniversary-2.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

AFSPA: మణిపూర్‌పై కేంద్రం కీలక నిర్ణయం

Maoists: దెబ్బ మీద దెబ్బ.. మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ

T Jayaprakash Reddy: నా మీద ఎన్నో కుట్రలు జరిగాయి

40 ఏళ్లుగా మసిలే జలధారలు!

టెన్త్‌ జవాబు పత్రాల తరలింపులో నిర్లక్ష్యం

జములమ్మకు గద్వాల సంస్థానాధీశుల వారసుడి పూజలు

కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..

CM Revanth Reddy: శ్రీమంతులే కాదు.. పేదలు తినాలి

NRI: తానా 24వ సదస్సుకు ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఎండికి ఆహ్వానం

మరిన్నీ ఎన్నారై వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 31 , 2025 | 09:22 PM