TANA: జులైలో డెట్రాయిట్‌లో 24వ తానా మహా సభలు
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:24 PM
న్యూఢిల్లీ: 24వ తానా మహా సభలు జులై 3,4,5 తేదీల్లో డెట్రాయిట్‌లో జరగనున్నాయి. తరతరాల తెలుగుదనం.. తరలివచ్చే యువతరం థిమ్‌తో తానా మహా సభలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగలా తానా మహా సభలు జరుగుతాయని తానా కాన్ఫరెన్స్ చైర్మన్ గంగాధర్ నాదెళ్ల తెలిపారు.

న్యూఢిల్లీ: 24వ (24th) తానా మహా సభలు (Maha Sabhalu) జులై 3,4,5 తేదీల్లో డెట్రాయిట్ (Detroit)లో జరగనున్నాయి. తరతరాల తెలుగుదనం.. తరలివచ్చే యువతరం థిమ్‌తో (Themes) తానా మహా సభలు జరగనున్నాయి. గత 45 ఏళ్లుగా ఉత్తర అమెరికాలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (North America) తెలుగు ప్రజలకు (Telugu people) సేవలందిస్తోంది. జులైలో జరగబోయే తానా మహా సభలకు కేంద్రమంత్రులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు, సంగీత గాయకులను ఆహ్వానించినట్లు తానా ప్రతినిధులు, తానా కాన్ఫరెన్స్ చైర్మన్ గంగాధర్ నాదెళ్ల తెలిపారు.
మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగలా తానా మహా సభలు జరుగుతాయని గంగాధర్ నాదెళ్ల తెలిపారు. అమెరికాలో తెలుగు వారి కోసం సేవా కార్యక్రమాలు, తెలుగు కళలు అభివృద్ధి చేయడం, ప్రచారం చేయడం కోసం పనిచేస్తున్నామని ఆయన అన్నారు. అమెరికా వస్తున్న తెలుగు విద్యార్దులు, అత్యవసర పరిస్థితులు,సహాయ కార్యక్రమాలకు తానా ఎప్పుడు ముందుంటుందన్నారు. డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత విధానపరమైన నిర్ణయాలు,నిబంధనలు కఠినతరం చేశారు. అమెరికాలో అక్రమ నివాసితుల్లో తెలుగువారు తక్కువ అని ఆయన తెలిపారు.