Share News

NRI News: ఎన్నారై టీడీపీ కార్యకర్తలతో అరవిందబాబు ఆత్మీయ సమావేశం..

ABN , Publish Date - Mar 17 , 2025 | 08:20 PM

నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని బేఏరియా ఎన్నారై టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. మిల్పిటాస్‌లో బేఏరియా ఎన్నారై టీడీపీ కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

NRI News: ఎన్నారై టీడీపీ కార్యకర్తలతో అరవిందబాబు ఆత్మీయ సమావేశం..
NRI News

నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని బేఏరియా ఎన్నారై టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. మిల్పిటాస్‌లో బేఏరియా ఎన్నారై టీడీపీ కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎన్నారై టీడీపీ నాయకుడు కోగంటి వెంకట్ ఆధ్వర్యంలో బిర్యానీ జంక్షన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించగా.. చదలవా అరవిందబాబు సతీసమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశఆరు. తన అనుభవాలు, విశేషాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి 100మందికి పైగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.


ముందుగా కోగంటి వెంకట్ అందరికీ స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా శ్రీనివాస్ తాడపనేని, జాస్తి రజనికాంత్.. డాక్టర్ ఆరవిందబాబుని పుష్పగుచ్చాలతో వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు. ఆ తరువాత స్థానిక ఎన్నారైలు ముఖ్యంగా పల్నాడు ప్రాంతానికి చెందిన పలువురు ఎన్నారైలు ఆరవిందబాబు, ఆయన సతీమణి సుధను శాలువాలతో సత్కరించారు.


ఎమ్మెల్యే ఆరవిందబాబు మాట్లాడుతూ.. తన రాజకీయ ప్రస్థానం, గత ఐదు సంవత్సరాల కాలంలో ఎదుర్కొన్న సవాళ్ళు తదితర విషయాలు వివరించారు. ఒక సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చి డాక్టర్‌గా సేవలందిస్తున్న తాను మరింత ప్రజాసేవ చెయ్యాలని భావించినప్పుడు తెలుగుదేశం పార్టీ మాత్రమే ఇందుకు సరైన వేదిక అని భావించానన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వం ఎనలేని తోడ్పాటునిచ్చిందని వివరించారు. తొలి ప్రయత్నంలో విజయం సాధించలేకపోయినా యువ నాయకులు నారా లోకేష్ పోరాట స్పూర్తితో మరింత పట్టుదలగా పోరాడి మలిప్రయత్నంలో విజయం సాధించానని తెలిపారు.

IMG-20250317-WA0052.jpg


ఈ విజయంలో ఎన్నారైల పాత్ర అత్యంత ప్రముఖమైనదని చెప్పారాయన. ఎన్నారై టీడీపీ సమన్వయకర్త కోమటి జయరాం సహకారం మర్చిపోలేనిదని, తన విజయానికి కృషి చేసిన ఎన్నారై తెలుగుదేశం సభ్యులకు సదా రుణపడి ఉంటానని అన్నారు. భవిష్యత్తులో రాష్ట్రాభివృద్దికి ప్రత్యేకించి పల్నాడు ప్రాంత అభివృద్దికి ఎన్నారైలు మరింత సహకారం అందించాలని ఎమ్మెల్యే కోరారు.

ఆరవిందబాబు సతీమణి సుధ మాట్లాడుతూ.. వైద్యుడిగా సేవలందిస్తున్న ఆరవిందబాబు తెలుగుదేశం పార్టీ ద్వారా మరింత సేవ చెయ్యాలన్న కోరిక వెలిబుచ్చినప్పుడు మరో ఆలోచన లేకుండా ఏకీభవించానని గుర్తుచేసుకున్నారు. ఈ ప్రయత్నంలో తమకు అండగా నిలిచిన ఎన్నారై తెలుగుదేశం సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


కోగంటి వెంకట్ ప్రసంగిస్తూ.. ఆరవిందబాబు పోరాట పటిమ ప్రతి తెలుగుదేశం కార్యకర్తకీ స్పూర్తిదాయకమని తెలిపారు. ఈ ఎన్నికలలో కోమటి జయరాం మార్గదర్శకత్వం, క్రమశిక్షణ ఎనలేనివని కొనియాడారు. డాక్టర్ కోడెల శివరాంప్రసాద్ తరువాత నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీకి ఆరవిందబాబు లాంటి నిబద్దత కలిగిన నాయకుడు శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం, ఈ విజయంలో ఎన్నారై తెలుగుదేశం కూడా భాగస్వామి కావడం ఆనందించదగిన విషయమని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరయిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని విజయ్ సాగర్ రెడ్డి జెట్టి, నరేష్ కొండపల్లి, కోన నరేంద్రనాధ్ రెడ్డి, నవీన్ సమన్వయపరచగా.. శ్రీనివాస్ వల్లురుపల్లి, వెంకట్ కొల్లా, శ్రీనివాస్ వట్టికూటి, భరత్ ముప్పిరాల, శ్రీకాంత్ కోనేరు, రమేష్ మల్లారపు, జగదీష్ గింజుపల్లి, రాజేష్ కొండపనేని, బ్రహ్మానంద నాయుడు దబ్బర, వెంకటేష్ కొండపల్లి, నవీన్ కొండపల్లి, శ్రీనివాస్ నెల్లూరు, తిరుపతిరావు, ఖాదర్ భాషా, గోపి, సందీప్ ఇంటూరి, అశోక్ మైనేని, రాం తోట తదితరులు హాజరయ్యారు.

Updated Date - Mar 17 , 2025 | 09:55 PM