Delta plane crashes: రన్‌వేపై విమానం తలకిందులు.. షాకింగ్ వీడియో వైరల్..
ABN , Publish Date - Feb 18 , 2025 | 06:53 PM
కెనడాలోని టొరంటో విమానాశ్రయంలో ప్రమాదం చోటుచేసుకుంది. పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో తలకిందులుగా బోల్తా పడింది. అలాగే కొంతదూరం వరకు వెళ్లి ఆగింది.

కెనడా (Canada)లోని టొరంటో విమానాశ్రయంలో ప్రమాదం చోటుచేసుకుంది (Toronto airport). పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో తలకిందులుగా బోల్తా పడింది. అలాగే కొంతదూరం వరకు వెళ్లి ఆగింది. 76 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో మిన్నెపొలిస్ నుంచి బయల్దేరిన ఈ విమానం పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయ రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది (Delta plane crashes).
ఈ విమానం ప్రమాద ఘటనలో 18 మంది గాయపడ్డారు. వారిలో ఓ చిన్నారితో సహా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మిగిలిన అందరూ క్షేమంగానే ఉన్నారు. రన్‌వేపై దట్టంగా మంచు పేరుకుపోయి ఉండడంతో విమానం ల్యాండింగ్ సమయంలో జారిపోయింది. ఆ సమయంలో తలకిందులుగా బోల్తా పడింది. దాంతో విమానంలో మంటలు చెలరేగాయి. భద్రతా సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. విమానంలో ఉన్న వారిని క్షేమంగా బయటకు తీశారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ప్రతికూల వాతావరణం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ఎయిర్‌పోర్ట్ అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో టొరంటో విమానాశ్రయం దగ్గర మైనస్ 8.6 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. అలాగే గంటకు 51 కి.మి. వేగంతో శీతల గాలులు వీస్తున్నాయి. రన్‌వేపై దట్టంగా మంచు పేరుకుపోవడం వల్ల విమానం స్కిడ్ అయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాఫ్తు జరిగిన తర్వాతే కారణాలను వెల్లడించగలమని తెలిపారు.
మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి..