NRI: గుంటూరు జిల్లా వాసి అరుదైన రికార్డు.. ఏం చేశారంటే..
ABN , Publish Date - Feb 27 , 2025 | 04:22 PM
Sheikh Hidayathulla: గుంటూరు జిల్లా వాసి అరుదైన రికార్డు సాధించారు. సౌదీ అరేబియాలోని నియోంలో వేలాది మంది ఉద్యోగ, కార్మికులతో సురక్షితంగా 30 లక్షల పని గంటలను పూర్తి చేయడం ద్వారా ఒక తెలుగు ప్రవాసీ అరుదైన సెఫ్టీ రికార్డును సాధించారు.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సమగ్రాభివృద్ధిలో భద్రత అనేది అత్యంత కీలకం, అందునా పని వేళల్లో భద్రత పాటించడం ప్రపంచవ్యాప్తంగా సమగ్రాభివృద్ధిలో ఒక కీలకంశం. సురక్షితంగా పని చేస్తూ తమ లక్ష్యానికి చేరుకోనే ఉత్తమమైన విధానాన్ని భద్రత పని గంటల కొలమానంతో పరిగణిస్తూ ప్రశంసించడం ప్రపంచవ్యాప్తంగా పురోగమన దేశాల్లో ఒక మంచి సంప్రదాయం. ప్రపంచంలో ఒక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా భావించే సౌదీ అరేబియాలోని నియోంలో వేలాది మంది ఉద్యోగ, కార్మికులతో సురక్షితంగా 30 లక్షల పని గంటలను పూర్తి చేయడం ద్వారా ఒక తెలుగు ప్రవాసీ అరుదైన సెఫ్టీ రికార్డును సాధించారు.
ALSO READ: Delta plane crashes: రన్‌వేపై విమానం తలకిందులు.. షాకింగ్ వీడియో వైరల్..
సురక్షిత పని గంటల్లో రికార్డు..
నియోం ప్రాజెక్టులో వివిధ రకాల సేవలందిస్తున్న ఎక్స్‌పర్టైస్ కాంట్రాక్టింగ్ అనే ఒక ప్రముఖ కంపెనీలో పని చేస్తున్న గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన శేఖ్ హిదయాతుల్లా తన కంపెనీ తరఫున 30 లక్షల సురక్షిత పని గంటలను సాధించడంతో అతన్ని నియోం, అనుబంధ సంస్థలు అభినందించారు. ఈ మేరకు ఇటీవల హిదయాతుల్లాకు పురస్కార పత్రం అందించి సత్కరించారు. నియోం, దాని అనుబంధ ప్రాజెక్టులల్లో పెద్ద సంఖ్యలో భారతీయులు పని చేస్తుండగా అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు.
ALSO READ: Canada New Visa Rules: కెనడా కొత్త వీసా రూల్స్‌తో భారతీయులకు ఇక్కట్లు
పలువురు అభినందనలు..
ఎక్స్‌పర్టైస్ కాంట్రాక్టింగ్ సంస్థ సౌదీ అరేబియాలోని ఒక ప్రముఖ సంస్థల్లో ఒకటిగా ఉంది. ఈ రకమైన సంస్థలు తమ సురక్ష, సంక్షేమానికి సంబంధించి సౌదీ అరేబియా విధానాలను అమలు చేస్తూ దేశ పురోగమానికి తమ తోడ్పాటు అందిస్తున్నారు. హిదయాతుల్లాను చాలామంది తెలుగు ప్రవాసీయులు అభినందిస్తుండగా ఆయన తన సంస్థ ఎక్స్‌పర్టైస్ కాంట్రాక్టింగ్ , సౌదీ అరేబియా అధికారులకు తనకు ఆవకాశం ఇచ్చినందుకు శేఖ్ హిదయాతుల్లా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
NRI: టాంటెక్స్ ఆధ్వర్యంలో ‘కోర్టు తీర్పుల్లో సాహిత్య మెరుపులు’
NRI: టాంటెక్స్ ఆధ్వర్యంలో ‘కోర్టు తీర్పుల్లో సాహిత్య మెరుపులు’
మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి..