Share News

Nara Lokesh: ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణపై మంత్రి లోకేశ్ అసహనం..

ABN , Publish Date - Jan 18 , 2025 | 03:15 PM

హైదరాబాద్: ఎన్టీఆర్ ఘాట్ ( NTR Ghat) నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ (శనివారం) ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌(Hyderabad)లోని ఎన్టీఆర్ ఘాట్‌కు లోకేశ్ చేరుకున్నారు.

Nara Lokesh: ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణపై మంత్రి లోకేశ్ అసహనం..
AP Education Minister Nara Lokesh

హైదరాబాద్: ఎన్టీఆర్ ఘాట్ (NTR Ghat) నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ (శనివారం) ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌(Hyderabad)లోని ఎన్టీఆర్ ఘాట్‌కు లోకేశ్ చేరుకున్నారు. దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఘాట్ వద్ద లోకేశ్ నివాళులు అర్పించారు. అయితే ఘాట్ నిర్వహణను చూసి ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఘాట్ గోడలు, పైకప్పు పెచ్చులు ఊడిపోవడం, గార్డెన్‌లో ఏర్పాటు చేసిన లైట్లు విరిగిపడి ఉండటాన్ని లోకేశ్ గమనించారు. ఘాట్ నిర్వహణ బాధ్యతలు చూడాల్సిన హెచ్ఎండీఏ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.


ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతు పనులు తన సొంత నిధులతో వెంటనే చేపట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణను హెచ్ఎండీఏ అధికారులు పట్టించుకోవడం లేదంటూ అక్కడికి వచ్చిన ఎన్టీఆర్ అభిమానులు సైతం తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇదేనా ఓ మహానేతకు ఇవ్వాల్సిన గౌరవం అంటూ మండిపడ్డారు. ఘాట్ నిర్వహణ తమకు అప్పగించాలని గతంలో పలుమార్లు తెలంగాణ ప్రభుత్వానికి ఎన్టీఆర్ ట్రస్ట్‌ విజ్ఞప్తి చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.


తాజాగా ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణను చూసి ఎంతో బాధపడిన మంత్రి లోకేశ్.. అవసరమైన అనుమతులు తీసుకొని వీలైనంత తొందరగా మరమత్తు పనులు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. కాగా, శనివారం ఉదయం నుంచీ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు నందమూరి, నారా కుటుంబసభ్యులు, బంధువులు, ఎన్టీఆర్ అభిమానులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, లక్ష్మీ పార్వతి, ఏపీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు సహా పలువురు ప్రముఖులు వచ్చి ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Chandrababu: నదుల అనుసంధానంతోనే కరవు రహిత రాష్ట్రం సాధ్యం

Pawan Kalyan: స్వచ్ఛ దివస్‌లో పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలు

Updated Date - Jan 18 , 2025 | 03:58 PM