Home » Ravichandran Ashwin
టెస్టు క్రికెట్లో 500 వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన టీమిండియా సినియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు.
కొన్ని సంవత్సరాల నుంచి భారత క్రికెట్ జట్టుకి ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్న జస్ప్రీత్ బుమ్రా తాజాగా సంచలన రికార్డ్ నెలకొల్పాడు. ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో అతడు అగ్రస్థానానికి ఎగబాకాడు. దీంతో.. టీ20, వన్డే, టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న మొట్టమొదటి బౌలర్‌గా బుమ్రా చరిత్రపుటలకెక్కాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. భారత్ విసిరిన 399 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఇంగ్లండ్ తడబడుతోంది. టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కొలేక ఇంగ్లీష్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఓడిన భారత్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది.
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగితే ఆ కిక్కే వేరు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. బంతితో మాయాజాలం చేసి బ్యాటర్లను బోల్తా కొట్టిస్తుంటాడు. విజృంభించి బంతులు సంధించే సమయంలో ఈ స్పిన్-మాంత్రికుడిని ఆడడం బ్యాట్స్మెన్లకు అంత సులభం కాదు. హైదరాబాద్‌లో టెస్టులో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో 150 వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్‌గా నిలిచాడు.
ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో మొదలైన తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో తొలి సెషన్లోనే టీమిండియా స్పిన్నర్లు సత్తా చాటారు. లంచ్ విరామ సమయానికే 3 కీలక వికెట్లు తీయడంతో వేగంగా ఆడాలనే ఇంగ్లండ్ బజ్‌బాల్ వ్యూహం బెడిసికొట్టింది.
ఈ నెల 22న జరగనున్న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యకమానికి హాజరయ్యే టీమిండియా ఆటగాళ్ల జాబితాలో మరో క్రికెటర్ కూడా చేరాడు. రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఆహ్వానం అందింది.
భారత క్రికెట్ జట్టు వచ్చే నెలలో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్ 10 నుంచి ప్రారంభమయ్యే సఫారీ పర్యటనలో భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. 10 నుంచి 14 వరకు టీ20 సిరీస్ జరగనుండగా, 17 నుంచి 21 వరకు వన్డే సిరీస్, డిసెంబర్ 26 నుంచి జనవరి 7 వరకు టెస్టు సిరీస్ జరగనుంది.
సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న భారత్ మరో పోరుకు సిద్ధమవుతోంది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే మ్యాచ్ వేదికైన పుణే చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది.