Share News

Year Ender 2024: ఈ ఏడాది రిటైరైన టాప్-10 క్రికెటర్స్.. లిస్ట్‌లో నలుగురు టీమిండియా స్టార్స్

ABN , Publish Date - Dec 19 , 2024 | 03:33 PM

Rewind 2024: ఈ ఏడాది క్రికెట్‌కు పలువురు మ్యాచ్ విన్నర్లు గుడ్‌బై చెప్పారు. తమ ఆటతో ఏళ్ల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన ప్లేయర్ల నిష్క్రమణ అందర్నీ నిరాశలో ముంచేసింది. మరి.. క్రికెట్‌కు అల్విదా చెప్పిన ఆ స్టార్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

Year Ender 2024: ఈ ఏడాది రిటైరైన టాప్-10 క్రికెటర్స్.. లిస్ట్‌లో నలుగురు టీమిండియా స్టార్స్
Top 10 Cricketers Retirement

Top 10 Cricketers Retirement: ఈ ఏడాది క్రికెట్‌కు పలువురు మ్యాచ్ విన్నర్లు గుడ్‌బై చెప్పారు. మ్యాచ్ విన్నర్లే కాదు.. కొందరు దిగ్గజాలు ఆట నుంచి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. తమ ఆటతో ఏళ్ల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన ప్లేయర్ల నిష్క్రమణ అందర్నీ నిరాశలో ముంచేసింది. వాళ్లను మళ్లీ మైదానంలో చూడలేమనే బాధ ఫ్యాన్స్‌ను తొలచివేస్తోంది. ఇలా గేమ్‌కు గుడ్‌బై చెప్పిన వారిలో టీమిండియా నుంచి రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్ సహా మరో ముగ్గురు స్టార్లు ఉన్నారు. మరి.. ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన టాప్-10 క్రికెటర్స్ ఎవరు? అనేది ఇప్పుడు చూద్దాం..


డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ ఏడాది ఆరంభంలోనే రిటైర్మెంట్ తీసుకున్నాడు. జనవరి 6వ తేదీన సిడ్నీ వేదికగా ఆడిన టెస్ట్ మ్యాచ్ అతడికి ఆఖరిదిగా మారింది. అన్ని ఫార్మాట్లలో గొప్ప బ్యాటర్లలో ఒకడిగా వార్నర్ ఎప్పటికీ గుర్తుండిపోతాడు.

విరాట్ కోహ్లీ

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సంవత్సరం టీ20లకు గుడ్‌బై చెప్పాడు. పొట్టి ప్రపంచ కప్-2024 ముగిసిన వెంటనే రిటైర్మెంట్ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. అయితే వన్డేలు, టెస్టుల్లో మాత్రం అతడు కొనసాగుతున్నాడు.


రోహిత్ శర్మ

భారత జట్టు సారథి రోహిత్ శర్మ ఈ ఏడాది టీ20ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్ మ్యాచే పొట్టి ఫార్మాట్‌లో అతడికి చివరిదిగా మారింది. కోహ్లీలాగే హిట్‌మ్యాన్ కూడా లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్‌లో కంటిన్యూ అవుతున్నాడు.

రవీంద్ర జడేజా

భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ ఏడాది పొట్టి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. టీ20 ప్రపంచ కప్‌తో ఆ ఫార్మాట్‌ నుంచి అతడు శాశ్వతంగా తప్పుకున్నాడు. కోహ్లీ, రోహిత్‌లాగే అతడూ వైట్ బాల్ క్రికెట్‌లో కొనసాగుతున్నాడు.


నీల్ వాగ్నర్

న్యూజిలాండ్ వెటరన్ పేసర్ నీల్ వాగ్నర్ ఈ ఏడాది రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఫిబ్రవరి 27వ తేదీన గేమ్‌‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ స్టార్టింగ్ ఎడిషన్‌ను కివీస్ సొంతం చేసుకోవడంలో వాగ్నర్ పాత్ర ఎంతో ఉంది.

టిమ్ సౌతీ

న్యూజిలాండ్ మరో దిగ్గజం టిమ్ సౌతీ కూడా ఈ సంవత్సరమే ఆట నుంచి నిష్క్రమించాడు. ఫార్మాట్లలకు అతీతంగా సౌతీ ఆడిన తీరు, తోపు బ్యాటర్లను కూడా భయపెట్టిన విధానం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.


శిఖర్ ధావన్

భారత మరో స్టార్ శిఖర్ ధావన్ కూడా 2024లోనే రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆగస్టు 24న అతడు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2013 సహా ఎన్నో ఐసీసీ టోర్నీల్లో అద్భుతమైన ఆటతీరుతో కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు ధావన్.

మొయిన్ అలీ

ఇంగ్లండ్ దిగ్గజం మొయిన్ అలీ ఇదే ఏడాది ఆట నుంచి నిష్క్రమించాడు. ఆస్ట్రేలియా సిరీస్‌కు తనను సెలెక్ట్ చేయకపోవడం, అవకాశాలు అడుగంటడం, ఫామ్ కోల్పోవడంతో గేమ్‌కు గుడ్‌బై చెప్పేశాడు అలీ.


రవిచంద్రన్ అశ్విన్

ఈ ఏడాది రిటైర్మెంట్ తీసుకున్న క్రికెటర్స్‌లో టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఒకడు. డిసెంబర్ 18న అతడు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఆసీస్‌తో గబ్బా టెస్ట్ ముగియగానే ఆట నుంచి వైదొలుగుతున్నానని అనౌన్స్ చేశాడు.


Also Read:

అశ్విన్ తండ్రి సంచలన వ్యాఖ్యలు.. కొడుకును టార్చర్ చేశారంటూ..

కోహ్లీ రిటైర్ అయ్యేది ఆ రోజే.. తేల్చేసిన కోచ్

రోహిత్‌‌ ఓవర్‌ కాన్ఫిడెన్స్.. వరుస వైఫల్యాలు.. అయినా..

For More Sports And Telugu News

Updated Date - Dec 19 , 2024 | 03:52 PM