Home » Sand Mafia
న్యూఢిల్లీ: ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని గత వారం ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. సుప్రీం ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలను ఏపీ ప్రభుత్వం కొనసాగించింది.
మరోసారి అధికారం ఇవ్వాలంటూ వైసీపీ అధినేత జగన్ సిద్ధం బస్సు యాత్ర చేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన జగన్.. ఇప్పుడు బస్సు యాత్ర చేస్తున్నారు. వైసీపీ అధినేత బస్సు యాత్రకు అనూహ్య స్పందన వస్తోందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. కాని వాస్తవ పరిస్థితి వేరేగా ఉన్నట్లు తెలుస్తోంది. దేనికి సిద్ధం.. ఐదేళ్ల పాలనలో దోచుకున్నది సరిపోక.. మరో ఐదేళ్లు దోచుకోవడానికి సిద్ధమా అంటూ ప్రజల నుంచే ప్రశ్నలు వస్తున్నాయట.
గతంలో ఇసుక కాంట్రాక్ట్ కట్టబెట్టిన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థకు జగన్ ప్రభుత్వం (Jagan Govt) రూ.1250 కోట్ల భారీ డిస్కౌంట్ను ఇవ్వలేదా అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్(Kommareddy Pattabhiram) ప్రశ్నించారు. తన దోపిడీకి సహకరిస్తుందనే రాష్ట్ర ఖజానాకు చేరాల్సిన సొమ్మును జగన్ ఈ సంస్థకు దారాదత్తం చేయలేదా అని నిలదీశారు.
AP Elections 2024: అవును.. మాజీ మంత్రి కొడాలి నాని స్థానాన్ని ప్రస్తుత మంత్రి జోగి రమేష్ భర్తీ చేస్తున్నారు. ఇంతకీ ఏమిటా కథ..? అసలేం జరుగుతోందనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం రండి..