Home » Sharad Pawar
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. 26 రాజకీయ పార్టీలకు చెందిన దాదాపు 50 మంది నేతలు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని ఐక్యంగా ఉంచాలని కోరుతూ ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ ను ఒప్పించేందుకు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎన్సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు రెండోరోజైన సోమవారంనాడు కూడా ప్రయత్నించారు.
బెంగళూరులో జరుగుతున్న రెండ్రోజుల విపక్ష పార్టీల సమావేశంలో ఎన్సీపీ నేత శరద్ పవార్ హాజరుపై అనిశ్చితి తొలగింది. సోమవారం కాకుండా మంగళవారం జరిగే సమావేశంలో పవార్ హాజరవుతారని ఎన్సీపీ తెలిపింది.
బెంగళూరులో జరుగుతున్న విపక్షాల సమావేశంలో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ రెండో రోజు పాల్గొననున్నారు. కూతురు సుప్రియా సూలేతో కలిసి ఆయన ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)పై నియంత్రణ సాధించేందుకు పోరాటం జరుగుతున్న సమయంలో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ (Sharad Pawar)తో రెబెల్ నేతలు ఆదివారం సమావేశమయ్యారు. తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తదితరులు పాల్గొన్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ భార్య ప్రతిభా పవార్ శుక్రవారంనాడు దక్షిణ ముంబైలోని బ్రీచ్క్యాండి ఆసుపత్రిలో చేరారు. అక్కడే ఆమె చేతికి శస్ర్రచికిత్స జరుగనుందని పార్టీ ప్రతినిధి తెలిపారు.
మహారాష్ట్రలోని ఎన్సీపీలో తిరుగుబాటు అనంతర క్రమంలో ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ , తిరుగుబాటు నేత, మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకే వేదికపైకి రాబోతున్నారు. మోదీకి ఆగస్టు1న లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును పుణెలో ప్రదానం చేయనున్నారు. ముఖ్య అతిథిగా శరద్ పవార్, అజిత్ పవార్ పాల్గోనున్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన సంక్షోభానికి తాను ఎవరినీ తప్పుపట్టనని, ఇందుకు బాధ్యత తానే తీసుకుంటానని ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. తన అంచనాలు తప్పాయని చెప్పారు. ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు అనంతరం ప్రజల ముందు వాస్తవాలు వివరించేందుకు శరద్ పవార్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు శనివారంనాడు శ్రీకారం చుచ్టారు. వర్షంలో తడుస్తూనే నాసిక్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటుదారులకు టు లేదని ఆ పార్టీ చీఫ్, మరాఠా దిగ్గజనేత శరద్ పవార్ చెప్పారు. తనకెలాంటి అలసట లేదని, రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని, తనలోని ఫైర్ చెక్కుచెదరలేదని చెప్పారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత శరద్ పవార్ యాక్షన్ మోడ్‌లోకి వచ్చారు.బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్ గ్రూపు నేతలపై వేటు వేశారు. అంతేకాదు.. 2024 అసెంబ్లీ ఎన్నికలపై శరద్ పవార్ కీలక ప్రకటన చేశారు.