Home » Sunday
సత్తువుంది... మేధస్సుంది... అయినా ఆటను మధ్యలోనే ఆపారు. అది కూడా ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ) గేమ్‌లో మూడున్నర లక్షల రూపాయలు గెలుచుకున్నాక... హెల్ప్లైన్లు ఉన్నప్పటికీ అనూహ్యంగా ‘క్విట్’ అయ్యారు. ఆయన నిర్ణయానికి ‘బిగ్‌బీ’ అమితాబ్ ఆశ్చర్యపోయారు... ఆనక అభినందించారు. ఆ కంటెస్టెంట్ పేరు డాక్టర్ నీరజ్ సక్సేనా. ఎవరీయన? ఏమా కథ...
పండగలప్పుడు పులిహోర తప్పక చేసుకుంటాం. పులిహోరలో పోషకాలేమిటి? ఏవైనా ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయా..
బార్టెండర్ ఉద్యోగానికి జెండర్‌తో పని లేదని నిరూపించి, తన వెరైటీ విన్యాసాలను ఎప్పటికప్పుడు యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు కవితా మేదర్. చీరకట్టులో ఆ ‘రికార్డు’ వీడియోలు జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇటీవలే యూట్యూబ్ నుంచి ‘సిల్వర్ బటన్’ను సాధించిన ఏకైక మహిళా బార్టెండర్ విశేషాలే ఇవి...
‘హింస’ అనేది బయట వీధుల్లోనే కాదు.. చదువుకునే బడుల్లోనూ దాగుంటుంది. ‘‘హిహిహి.. నువ్వు హిప్పొపొటమస్లాగున్నావు’’ అనే వెక్కిరింతలు.. ‘‘నువ్వు చింపాంజీ కంటే నల్లగున్నావు’’ అనే వర్ణవివక్షలకు తరగతి గదులు వేదికలు అవుతున్నాయి. లేత గుండెల్ని గాయపరుస్తాయి.. ఎగతాళి చేయడం, హేళన చేయడం, ఆట పట్టించడం...
మైదానంలో రేసుగుర్రాల్లా పరుగెడుతూ... ఎదుటి ఆటగాడికి చిక్క కుండా... ఒడుపుగా తప్పించు కుంటూ... బంతిని లాఘవంగా గోల్‌పోస్ట్‌లోకి కొట్టగానే... ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా కేరింతలతో ఊగిపోతుంది. నరాలు తెగే ఉత్కంఠతో సాగే సాకర్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. యూకేలోని కాట్స్‌వోల్డ్స్ దగ్గర ఉన్న ‘బోర్టన్ ఆన్ ద వాటర్’ అనే గ్రామంలో ఫుట్‌బాల్ మ్యాచ్ సైతం అంతే ఉత్కంఠ భరితంగా సాగుతుంది. అయితే మ్యాచ్ జరిగేది మైదానంలో కాదు... నదిలో....
ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకుంటే... మొదట గుర్తొచ్చేది లగేజీనే. ట్రావెల్ బ్యాగా? సూట్‌కేసా?... పెద్దదా? చిన్నదా?... ఏయే దుస్తులు, వస్తువులు తీసుకెళ్లాలి? అన్నీ సందేహాలే. సూట్‌కేస్ సర్దుకోవాలంటేనే తెలియని తలనొప్పి. అందుకే ఇప్పుడు 5-4-3-2-1 ప్యాకింగ్ టెక్నిక్ వచ్చేసింది. ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ఇంతకీ ఏమిటా టెక్నిక్...
భూమి పెడ్నేకర్... చేసే పాత్రల కన్నా, ధరించే దుస్తులతోనే అందరి చూపు తన వైపు తిప్పుకునేలా చేస్తుంది. ఒక స్టార్‌గా ఫ్యాషన్ ప్రపంచంలో తనను తాను ఎప్పుడూ సరికొత్తగా ఆవిష్కరించుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ‘తను ధరించే దుస్తులే తనేమిటో చెప్తాయ’నే ఈ బోల్డ్ బ్యూటీ ఫ్యాషన్ మంత్ర ఏమిటంటే...
కొండపై ఇంకా తెల్లారలేదు. చుట్టూ చీకటి. గుడిసె ముందు నులకమంచంలో నిద్రపోతున్న సుక్కాయి నిద్ర నుంచి గతుక్కుమని లేచేడు. వారం నుంచి ఇలాగే జరుగుతోంది. ఒకసారి లేచిన తర్వాత మరి నిద్రపోడు. నిశ్శబ్దంగా కూర్చుని సూర్యుడు వచ్చేవరకూ ఆలోచిస్తూనే వుంటాడు. సూర్యుడు మొదట అడుగుపెట్టేది ఆ కొండ వూరిలోకే. సూర్యుడు వచ్చే దిక్కు వైపు తీక్షణంగా చూస్తున్నాడు.
అని ఎప్పుడో, ఎక్కడో చదివినట్లు గుర్తు! ఉన్న విస్తీర్ణం చాలదంటూ పొరుగునున్న దేశాల్లో కాలూ వేలూ పెట్టడం చైనా నైజం. అంతటి చైనా ఎలా ఉంటుంది? చరిత్రలో చదివిన ‘గ్రేట్ వాల్’పై కాలు పెట్టి, కళ్లతో చూస్తే వచ్చే అనుభూతి... సోషల్ మీడియాలో కవ్వించే చాంచింగ్ సిటీ మెరుపు కలల మర్మమేమిటి? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలకు సమాధానం వెతకాలంటే చైనా వెళ్లాల్సిందే!
‘‘జొన్నకలి జొన్నయంబలి/ జొన్నన్నము జొన్నపినరు జొన్నలు తప్పన్ సన్నన్నము సున్నగదా/ పన్నుగ పల్నాట నున్న ప్రజలందఱకున్’’ అనేక రోగాలపైన ఔషధం కావటాన జొన్న సామాన్యుడి జొన్నాయుధంగా మారిందిప్పుడు. ఒకనాడు కూటికి లేనివాళ్లు తినేది! ఇప్పుడు బియ్యమే చవక. ‘ఓడలు-బండ్లు’ అంటే ఇదే! తిట్టుకుంటూనే శ్రీనాథుడు కొన్ని జొన్నవంటకాల్ని ఈ చాటువులో పేర్కొన్నాడు.