Home » T20 World Cup 2024
టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలు సాధిస్తున్న టీమిండియా ఈ టోర్నీలోనే అసలు సిసలైన మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు పాకిస్తాన్ తప్ప అన్నీ చిన్న జట్లతోనే తలపడింది. తొలిసారి కంగారూలను ఢీకొట్టబోతోంది.
టీ20 వరల్డ్‌కప్‌లోని సూపర్-8లో భారత జట్టు మెరుగైన స్థానంలో ఉంది. రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సొంతం చేసుకొని.. అద్భుత నెట్ రన్‌రేట్‌తో గ్రూప్-1లో అగ్రస్థానంలో...
టీ20 ప్రపంచకప్‌లో పసికూన అఫ్గానిస్తాన్ మరో సంచలన విజయం నమోదు చేసింది. గ్రూప్ దశలో న్యూజిలాండ్‌ను మట్టికరిపించిన అఫ్గాన్ టీమ్ తాజాగా సూపర్-8లో ఏకంగా ఆస్ట్రేలియానే చిత్తు చేసింది. ఈ విజయంతో సెమీస్ రేస్‌ను అఫ్గాన్ ఆసక్తికరంగా మార్చింది. తమ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
దక్షిణాఫ్రికా పవర్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో అతడికి జరిమానా పడింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 1ను మిల్లర్ ఉల్లంఘించినట్టు విచారణలో తేలింది. దీంతో మిల్లర్‌ను పిలిచిన అంపైర్లు మందలించారు.
టీ20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024)లో అఫ్ఘనిస్తాన్(Afghanistan) జట్టు చరిత్ర సృష్టించింది. రషీద్ ఖాన్(rashid khan) నేతృత్వంలోని ఈ జట్టు అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియా(Australia)ను ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.
‘పరుగుల యంత్రం’ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సత్తా గురించి కొత్తగా మాట్లాడుకోవాల్సిందేమీ లేదు. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో అయితే విరాట్ ఓ సూపర్ మ్యాన్‌గా మారిపోతాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతుంటాడు. టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా శనివారం భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లోనూ కోహ్లీ ఆకట్టుకున్నాడు.
టీ20 వరల్డ్‌క్‌పలో భారత్ అజేయ ఆటతీరు కొనసాగుతోంది. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చడంతో శనివారం గ్రూప్ 1లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టోర్నీలో జట్టుకిది వరుసగా ఐదో విజయం కాగా.. సూపర్-8లో రెండోది. దీంతో తమ గ్రూప్‌లో 4 పాయింట్లతో టాప్‌లో నిలవడంతో పాటు
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2024)లో నేడు 47వ మ్యాచ్ టీమిండియా, బంగ్లాదేశ్(India vs Bangladesh) జట్ల మధ్య జరగనుంది. గ్రూప్ ఏలోని సూపర్ 8లో ఇది రెండో మ్యాచ్ కాగా మొదటి ఆటలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఓడించింది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న మ్యాచులో ఏ జట్టు గెలుస్తుంది, గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
అఫ్గాన్‌తో జరిగిన టీ 20 వరల్డ్ కప్ (T20 World Cup 2024) పోరులో ఇండియా ఘన విజయం సాధించింది. అయితే గెలుపొందిన ప్రతీసారి డ్రెస్సింగ్ రూమ్‌లో ఇచ్చే బెస్ట్ ఫీల్డర్ మెడల్(Best Fielder Medal) ఈ సారి ఎవరికి దక్కుతుందోననే ఆసక్తి అందరికీ ఉండింది.
సూపర్-8లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులను నమోదు చేసింది. సూర్యకుమార్ యాదవ్..