Share News

T20 Worldcup: డేవిడ్ మిల్లర్ ఓవరాక్షన్.. మందలించిన అంపైర్లు.. అసలేం జరిగిందంటే..!

ABN , Publish Date - Jun 23 , 2024 | 11:51 AM

దక్షిణాఫ్రికా పవర్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో అతడికి జరిమానా పడింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 1‌ను మిల్లర్ ఉల్లంఘించినట్టు విచారణలో తేలింది. దీంతో మిల్లర్‌ను పిలిచిన అంపైర్లు మందలించారు.

T20 Worldcup: డేవిడ్ మిల్లర్ ఓవరాక్షన్.. మందలించిన అంపైర్లు.. అసలేం జరిగిందంటే..!
David Miller

దక్షిణాఫ్రికా పవర్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ (David Miller) ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో అతడికి జరిమానా పడింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ (ICC Code of Conduct) లెవల్ 1‌ను మిల్లర్ ఉల్లంఘించినట్టు విచారణలో తేలింది. దీంతో మిల్లర్‌ను పిలిచిన అంపైర్లు (Umpires) మందలించారు. సూపర్-8 లో భాగంగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా (South Africa vs England) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మిల్లర్ ఐసీసీ నియమావళిని ఉల్లంఘించాడు. రెండేళ్ల వ్యవధిలో ఇది తొలి నేరం కాబట్టి మిల్లర్‌ను అంపైర్లు మందలించి వదిలేశారు (T20 Worldcup).


దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 19 ఓవర్లో మిల్లర్ క్రీజులో ఉన్నాడు. ఆ ఓవర్ వేసిన బౌలర్ సామ కర్రన్ రెండో బంతిని ఫుల్ టాస్ వేశాడు. దానిని డీప్ స్క్వేర్ లెగ్ వైపు కొట్టి మిల్లర్ రెండు పరుగులు రాబట్టాడు. అయితే ఎత్తు కారణంగా దానిని నో-బాల్‌గా ప్రకటిస్తాడేమోనని లెగ్ అంపైర్ క్రిస్ బ్రౌన్ వైపు చూశాడు. అయితే బ్రౌన్ మాత్రం దానిని సాధరణ డెలివరీగానే ప్రకటించాడు. ఆ తర్వాత మూడో బంతిని సిక్సర్ బాదిన మిల్లర్.. బ్రౌన్ వైపు చూస్తూ సీరియస్‌గా ఏదో మాట్లాడాడు. మ్యాచ్ అనంతరం ఆన్ ఫీల్డ్ అంపైర్లు, థర్డ్ అంపైర్.. మిల్లర్ ప్రవర్తనపై అభియోగాలు మోపారు.


ఈ మొత్తం ఘటనపై మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రోవ్ విచారణ ప్రారంభించారు. విచారణ సమయంలో మిల్లర్ తన తప్పును అంగీకరించాడు. తన ప్రవర్తన పట్ల విచారం వ్యక్తం చేశాడు. రెండు నెలల వ్యవధిలో ఇది తొలి నేరం కాబట్టి మిల్లర్‌ను మందలించి వదిలేశారు. మరోసారి ఇదే ప్రవర్తన పునరావృతమైతే మిల్లర్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం పడే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి..

T20 Worldcup: ప్యాట్ కమిన్స్ అత్యంత అరుదైన రికార్డు.. ప్రపంచకప్‌లో వరుసగా రెండ్రో హ్యాట్రిక్!


T20 World Cup 2024: ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన అఫ్ఘనిస్తాన్.. సరికొత్త రికార్డు


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 23 , 2024 | 11:51 AM