Home » TDP
రైతులు ధాన్యాన్ని నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే వెసులుబాటుతో పాటు.. 24 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ రైతులకు చెల్లించాల్సిన రూ.1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను ఎగ్గొడితే, చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందన్నారు.
హోంమంత్రి అనితపై ప్రస్తు తం విశాఖపట్నం కోర్టులో ఉన్న చెక్‌బౌన్స్ కేసును హైకోర్టు కొట్టివేసింది.
రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికలు జరుగుతున్న మూడు సీట్లు ఏకగ్రీవం అయ్యాయి. ఈ సీట్లకు మంగళవారం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు.
అర్బన నియోజక వర్గానికి చెందిన టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సరిపూటి రమణ, నా యకులు మంజునాథ్, దాదాపీర్ మన టీడీపీ యాప్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ప్రశంసా పత్రాలను మంగళవారం టీడీపీ అర్బన కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంక టేశ్వరప్రసాద్ వారికి అందజేశారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
విదేశాలకు రేషన్ బియ్యం ఎగుమతి చేయకుండా అడ్డుకునేందుకు కాకినాడ సీపోర్టులో త్వరలో కొత్తగా చెక్‌పోస్టు ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
రాష్ట్రం నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు.
అర్బన నియోజకవర్గంలో పేదల సభ్యత్వ నమోదు కోసం పలువురు విరాళాలు అందించారు. అనంత పురంలోని టీడీపీ అర్బన కార్యాలయంలో సోమవా రం మాజీ కార్పొరేటర్ బల్లా పల్లవి రూ. లక్ష, 9వ డివిజన నాయకుడు సాకే రామాంజినేయులు రూ. 50 వేలను ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు అందజేశారు. వారిని ఎమ్మెల్యే అభినందించారు.
నాగబాబును తొలుత టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరగ్గా.. టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడిని నియమించారు. ఆ తర్వాత ఏపీ నుంచి మూడు రాజ్యసభ సభ్యుల స్థానాలు ఖాళీ అవ్వడంతో తప్పనిసరిగా నాగబాబుకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పిస్తారని చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో నాగబాబు రాజ్యసభ సభ్యత్వంపై..
తప్పులు బయటపడుతున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి తన స్థాయి.. వయసును మరిచిపోయి నోటికొచ్చినట్లు చిల్లరగా మాట్లాడుతున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని.. ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామని అన్నారు.