Home » TDP
హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ గురువారం ప్రమాణం చేయనున్నారు. ఆయన ఆహ్వానం మేరకు ఈ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హజరుకానున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి.. 11 గంటలకు చంఢీఘర్ చేరుకుంటారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు దూకుడు పెంచారు. వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు.
స్కిల్ కేసు తాజా ఆస్తుల అటాచ్మెంట్లో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని ఈడీ స్పష్టం చేసింది. వినాయక్ ఖాన్వెల్కర్, సుమన్ బోస్ సహ పలువురు బోగస్ ఇన్వాయిస్లు సృష్టించి ఈ పనికి పాల్పడినట్లు గుర్తించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఈడీ స్టేట్మెంట్లో నమోదు కాలేదు. మొత్తం వ్యవహారంలో చంద్రబాబుకు కానీ ఆయనకు సంబంధించిన వారికి డబ్బులు అందినట్లుగా ఎక్కడా చూపించలేదు.
గత ఐదేళ్ళూ ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా వైసీపీ నేతలను మొక్కవోని స్థైర్యంతో ఎదుర్కొన్న టీడీపీ(TDP) శ్రేణులు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో పెద్ద ఎత్తున సంబరపడ్డాయి. అయితే వంద రోజులు కూడా గడవక మునుపే శ్రేణులు నిరుత్సాహానికి లోనయ్యాయి.
అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తంబళ్లపల్లె నియోజ కవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రా రెడ్డి పేర్కొన్నారు.
తాళ్లరేవు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యేదాట్ల బుచ్చిబాబు అన్నారు. మంగళవారం మం డలంలోని చొల్లంగి, చొల్లంగిపేట, జి.వేమవరం, పటవల, కోరింగ, తాళ్లరేవు, పోలేకుర్రు, జార్జీపే ట, నీలపల్లి, సుంకరపాలెం, ఇంజరం గ్రామాల్లో
సామర్లకోట, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): పల్లెల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మ కాయల చినరాజప్ప అన్నారు. పల్లె పండుగ కా ర్యక్రమంలో భాగంగా మంగళవారం మండలం లోని పనసపాడులో సీసీరోడ్లు నిర్మాణాలకు రాజ ప్ప కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు.
పల్లె పండుగ అంటే ఇదే అని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నెల రోజుల్లో నియోజకవర్గంలోని నాలుగు పంచాయతీల్లో రూ.3కోట్లతో అభివృద్ధి పనులు చపడతామన్నారు.
కూటమి ప్రభుత్వంలో పల్లెలకు మంచిరోజులు వచ్చాయని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మండలంలోని బీ యాలేరులో మంగళవారం ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు.
పోలీసులకు ఆయుధాల్లాగే ప్రజలకు మొబైల్ ఫోన్లు కూడా ఉన్నాయని, వాటిని వినియోగించి నేర నియంత్రణకు సహకరించాలని హోంమంత్రి అనిత కోరారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు.