Home » Technology news
అత్యాధునిక రోబోటిక్ టెలీ సర్జరీ యంత్రం ‘ఎస్‌ఎ్‌సఐ మంత్ర-3’ని ఎస్‌ఎ్‌సఐ(సుధీర్ శ్రీవాత్సవ ఇన్నోవేషన్స్) సంస్థ గురువారం ఆవిష్కరించింది. అంతేకాక, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ మంత్ర-3 రోబోటిక్ వ్యవస్థతో టెలీ సర్జరీ ట్రయల్‌ను విజయవంతంగా చేసి చూపించింది.
కొత్త మొబైల్ తీసుకుంటే పాత ఫోన్లో ఉన్న వాట్సప్ చాట్ అంతా ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా పెద్ద తతంగం ఉంటుంది. త్వరలో ఆ బాధ లేకుండా ఒక్క క్లిక్‌తో ఏ ఫోన్లోకైనా వాట్సప్ చాట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా. ఇందుకోసమే వాట్సప్ కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురాబోతోంది.
గత రెండు నెలల్లో రూ.16 వేల 500 కోట్ల ఐఫోన్లు విదేశాలకు ఎగుమతి(iPhones Exports) అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు నెలల్లోనే 2 బిలియన్ డాలర్లకుపైగా విలువ కలిగిన ఐఫోన్లను ఎగుమతి చేయడం మేడ్ ఇన్ ఇండియా సంకల్పానికి ఎంతో ప్రోత్సాహంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
గూగుల్‌కు చెందిన ఏఐ ఓవర్వ్యూస్ - వివిధ ప్రశ్నలకు స్పందించడంలో తప్పులు చోటుచేసుకుంటున్నాయి. పూర్తిగా తప్పు లేదంటే ఉపకరించని రీతిలో సమాధానాలను ఇస్తోంది. ప్రస్తుతం దాన్ని సరిదిద్దే పనుల్లో గూగుల్ ఉంది.
ఫేస్బుక్ అనతికాలంలోనే అంటే ఆరంభించిన ఇరవై సంవత్సరాల్లోనే అన్ని వర్గాల ఆదరణ పొందింది. మరీ ముఖ్యంగా గడచిన మూడేళ్ళలో యువతకు మరింత చేరువైంది. ఈ విషయాన్ని ఫేస్బుక్ స్వయంగా ప్రకటించింది. అమెరికా, కెనడాలోనే 18-29 మధ్యవయస్కులైన నాలుగుకోట్ల మంది యువత రోజూ ఫేస్‌బుక్‌ని ఉపయోగిస్తున్నారు.
ఆడుతు, పాడుతు పనిచేయడం కాదు, ప్రయాణిస్తే ఎంతో బాగుంటుంది. ఉబర్ సరిగ్గా అదే పని చేయ నుంది. ఉబర్ తన ప్రయాణికులను ఆకట్టుకునేందుకు వీలుగా రైడ్ సమయంలో మినీగేమ్స్ను పరిచయం చేసే పనిలో ఉంది. అందుకుగానే యాప్‌లోనే మినీ గేమ్స్‌ను అభివృద్ధిపరుస్తోంది.
గూగుల్ హెల్త్ కనెక్ట్‌తో ఆరోగ్య సంబంధ డేటాను ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉపయోగించు కోవచ్చు. ఇష్టమైన హెల్త్ యాప్‌లతో అనుసంధానం అయ్యేందుకు ఇది తోడ్పడుతుంది. అవసరమైన హెల్త్ డేటాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీంతో పొందవచ్చు. నిజానికి వివిధ హెల్త్ ఫిట్నెస్ యాప్‌ల నుంచి సమాచారాన్ని తీసుకుని క్రోడీకరించుకోవడం సమస్యే. అయితే గూగుల్ అందుకు పరిష్కారంగా గూగుల్ హెల్త్ కనెక్ట్‌కు రూపకల్పన చేసింది.
గూగుల్ - మ్యాప్స్ లొకేషన్ హిస్టరీ ఇకపై క్లౌడ్‌లో కాకుండా ఫోన్లోనే స్టోర్ కానుంది. లొకేషన్ డేటా గూగుల్ సెర్వర్లలో ఉంటే జియోఫెన్స్ వారెంట్లకు లోనుకావాల్సి వస్తోంది. ఈ మార్పుతో ఇకపై గూగుల్‌కు రెస్పాండ్ అయ్యే ఇబ్బంది తప్పుతుంది. అలాగే లొకేషన్ హిస్టరీని ఇకపై టైమ్‌లైన్ అంటారు. ‘యువర్ టైమ్‌లైన్’ ఫీచర్లో ఉంటుంది.
మైక్రోసాప్ట్ ఇప్పటికే విండోస్ 10కి వచ్చే ఏడాది అక్టోబర్ 10 నుంచి సపోర్ట్‌ని ఆపేస్తున్నట్టు ప్రకటించింది. అయితే అనూహ్యంగా విండోస్ 10కి బేటా ప్రోగ్రామ్ని తిరిగి ఆరంభించింది. తద్వారా కొత్త ఫీచర్లను టెస్ట్ చేస్తోంది. విండోస్ 11కి ప్రత్యేకంగా తెచ్చిన ఏఐ కోపైలెట్ని విండోస్ 10 ఇప్పటికే పొందింది.
వేడి ఏ రూపంలో ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బందులు తప్పవు. స్మార్ట్ ఫోన్‌కూ వర్తిస్తుంది. ఎండలనే కాదు, గేమ్స్ తదితరాలతో ఎక్కువగా ఉపయోగించినా ఫోన్ వేడెక్కుతుంది. ఫలితంగా ఇబ్బందులకూ అవకాశం ఉంటుంది. దరిమిలా ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు కింది జాగ్రత్తలు తీసుకోవాలి.