Share News

Reversing Death: మరణించినా బతికించొచ్చు

ABN , Publish Date - Mar 31 , 2025 | 04:14 AM

న్యూయార్క్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సామ్‌ పార్నియా మరణాన్ని తిరిగి తీసుకురావడం సాధ్యమని చెప్పారు. ఎక్మో యంత్రం, ఔషధాలతో గుండె నిలిపి పోయిన వ్యక్తులను కూడా తిరిగి జీవితం ఇవ్వవచ్చని ఆయన వివరించారు

Reversing Death: మరణించినా బతికించొచ్చు

మరణం తాత్కాలిక స్థితే.. వెనక్కి తిప్పటం సాధ్యమే

ఎక్మో యంత్రం, కొన్ని ఔషధాలతో తిరిగి జీవం పోయవచ్చు

కణాల్లో జీవక్రియలు నిలిచిపోనంత వరకూ దీనికి అవకాశం ఉంది

న్యూయార్క్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ సామ్‌ పార్నియా

  • న్యూయార్క్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ సామ్‌

వాషింగ్టన్‌, మార్చి 30: మరణంతో అంతా అయిపోయినట్టేనా? జీవితానికి ముగింపేనా?.. కానే కాదని, మరణాన్ని వెనక్కి తిప్పవచ్చని చెబుతున్నారు న్యూయార్క్‌ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ సామ్‌ పార్నియా. గుండె, ఊపిరితిత్తులు పాడైపోయిన వారికి చికిత్సను అందించే ఎక్మా యంత్రంతో కొన్ని ఔషధాల సమ్మేళనాన్ని ఉపయోగించి ‘పోయిన ప్రాణాన్ని’ తిరిగి నిలబెట్టవచ్చని ఆయన పేర్కొంటున్నారు. ఎపినెఫ్రిన్‌, మధుమేహ చికిత్సలో వినియోగించే మెట్‌ఫార్మిన్‌, విటమిన్‌ సీ, వాసోప్రెసిన్‌, సప్లిమెంట్‌ సల్‌బుటమైన్‌.. వీటిని తగుపాళ్లలో కలిపి ఎక్మా మెషిన్‌తో కలిపి అందిస్తే.. గుండె స్తంభించిన వారిలో కూడా తిరిగి జీవం పోయవచ్చని సామ్‌ తెలిపారు. ప్రయోగశాలలో జంతువుల మీద తాము జరిపిన ప్రయోగాల్లో ఇది సాధ్యమైందన్నారు. ‘మనిషి మరణించిన తర్వాత శరీరంలోని కణాలన్నీ వెంటనే చచ్చుబడిపోవు. దానికి కొంత సమయం పడుతుంది. మెదడు కూడా కొన్ని రోజులపాటు సజీవస్థితిలో ఉంటుంది. దీనిని సైన్స్‌ ఇప్పటికే నిరూపించింది. మేం జరిపిన కొన్ని పరిశోధనల్లో.. గుండెపోటుకు గురైన వ్యక్తుల్లో గుండె కొట్టుకోవటం మానేసిన తర్వాత కూడా దాదాపు గంటపాటు జ్ఞాపకాలు పదిలంగా ఉండటం గమనించాం. వారి మెదడు పనితీరును పరిశీలించినప్పుడూ ఇది నిజమేనని తేలింది’ అని సామ్‌ వివరించారు. మరణానికి గురైన వ్యక్తి శరీర కణాల్లో జీవక్రియలు పూర్తిగా నిలిచిపోనంత వరకూ ఆ వ్యక్తిని బతికించవచ్చని సామ్‌ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

పొట్టు పొట్టు కొట్టుకున్నారు

Hardik Pandya: కుర్రాడితో హార్దిక్ కొట్లాట.. బూతులు తిడుతూ..

Upcoming IPOs: ఇన్వెస్టర్లకు అలర్ట్..వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..

Updated Date - Mar 31 , 2025 | 04:21 AM