Share News

జియో,ఏయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా.. మీ ఏరియాలో ఏది బెస్ట్..

ABN , Publish Date - Apr 08 , 2025 | 08:24 AM

Which Network Is Best: పల్లెటూరు దగ్గరినుంచి సిటీల్లోని కొన్ని ఏరియాల్లో లో నెట్‌వర్క్ సమస్య కస్టమర్లను తీవ్రంగా వేధిస్తోంది. సిగ్నల్స్ సరిగా రాక చాలా ఇబ్బందిపడుతూ ఉన్నారు.

జియో,ఏయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా.. మీ ఏరియాలో ఏది బెస్ట్..
Which Network Is Best

జియో, ఏయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా.. ఇప్పుడు దేశాన్ని శాసిస్తున్న దిగ్గజ టెలికాం కంపెనీలు ఈ మూడే. ఒక్కో టెలికాంకు కొన్ని కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. ప్రత్యర్థి కంపెనీ పోటీని తట్టుకోవడానికి ఒకదాన్ని మించి మరోటి రీచార్జ్ ప్లాన్లను చవకకే అందిస్తున్నాయి. నెట్‌వర్క్ విషయంలోనూ ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. అయితే, నెట్‌వర్క్ విషయంలో కంపెనీకి, కంపెనీకి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో జియో నెట్‌వర్క్ బాగుంటే.. మరికొన్ని ఏరియాల్లో ఏయిర్‌టెల్ నెట్‌వర్క్ బాగుంటుంది. చాలా మందికి ఈ నెట్‌వర్క్‌ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. మనల్ని ఎంతగానో బాధించే.. లో నెట్‌వర్క్ సమస్యకు పరిష్కారం దొరికింది.


కస్టమర్లు ఇప్పుడు తమ ఏరియాలో లేదా సిటీలో నెట్‌వర్క్ కవరేజ్ ఎలా ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు. ది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా.. జియో, ఏయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు ఊరట కలిగించే పని చేసింది. ఇప్పుడు మీరు ఓ నెట్‌వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు మారుతున్నారనుకోండి. సిమ్ కొనే ముందే మీ ఏరియాలో ఏ నెట్‌వర్క్ బాగుందో తెలుసుకోవచ్చు. తద్వారా మనకు అన్ని విధాల పనికి వచ్చే సిమ్‌ను తీసుకోవచ్చు. ట్రాయ్ తీసుకున్న ఈ నిర్ణయంతో కొన్ని కోట్ల మందికి మంచి జరుగుతోంది. తమకు అన్ని విధాల పనికి వచ్చే సిమ్‌ను కస్టమర్లు కొనుగోలు చేస్తున్నారు.


మీ ఏరియాలో ఏ నెట్‌వర్క్ బాగుందో ఎలా తెలుసుకోవాలి?

  • మీరు ఏయిర్‌టెల్ కస్టమర్ అయితే గనుక.. గూగుల్‌లోకి వెళ్లి.. ఎయిర్‌టెల్.ఇన్‌ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. అక్కడ ‘చెక్ కవరేజ్ ’ అనే సెక్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి 4జీ, 5జీ నెట్‌వర్క్ కవరేజీని తెలుసుకోవచ్చు. ఏరియాల వారీగా కవరేజ్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు.

  • మీరు జియో కస్టమర్ అయితే గనుక జీయో.కామ్‌లోకి వెళ్లండి. అక్కడ ‘కవరేజ్ మ్యాప్’ సెక్షన్‌ను ఓపెన్ చేయండి. అందులో ఏరియాల వారీగా కవరేజ్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు.

  • మీరు వొడాఫోన్ కస్టమర్ అయితే గనుక. వొడఫోన్ ఇండియా అఫిషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. ‘నెట్‌వర్క్ కవరేజ్’ సెక్షన్ ఓపెన్ చేసి మీ ఏరియాలో కవరేజ్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు.

  • అయితే, భారత సంచార్ నిగమ లిమిటెడ్‌కు ఈ సర్వీస్ ప్రస్తుతం అందుబాటులో లేదు.


ఇవి కూడా చదవండి:

Dilsukhnagar Blast Case: మరికొన్ని గంటల్లో దిల్‌సుఖ్‌నగర్ బ్లాస్ట్ కేసులో కీలక తీర్పు

Jagan: రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన

Updated Date - Apr 08 , 2025 | 08:26 AM