Home » Telangana Election2023
అవును.. గజ్వేల్‌తో (Gajwel) పాటు కామారెడ్డి (Kamareddy) అసెంబ్లీ నుంచి కూడా పోటీచేస్తున్నాను.. ఎందుకు సార్ అంటే.. పార్టీ డిసైడ్ చేసింది.. ఏం చేద్దాం అంటావ్.. పార్టీకి లేని ఇబ్బంది మీకేంటి..? ఇవీ ప్రగతి భవన్ వేదికగా బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా (BRS First List) రిలీజ్ చేసే క్రమంలో గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) చేసిన కామెంట్స్. కేసీఆర్ అనుకున్నట్లుగానే రెండు చోట్ల నుంచీ పోటీచేస్తారు సరే..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఈసారి స్వయంగా సీఎం కేసీఆరే బరిలో ఉండనున్నారు. జిల్లాలోని మరో మూడు నియోజకవర్గాల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ కేటాయిస్తూ కేసీఆర్ ప్రకటించారు.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 119 సీట్లకు 115 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ సోమవారం నాడు తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. మొత్తం 115 సీట్లలో రెడ్డి వర్గానికి అత్యధిక సీట్లను కేసీఆర్ కేటాయించారు. 2014లో తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ దళితులకు సీఎం పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. దళితులకు సీఎం పదవి దేవుడెరుగు.. తర్వాతి ఎన్నికల్లో పార్టీ తరఫున కేసీఆర్ ఎక్కువ సీట్లు ఇస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ ప్రస్తుతం దళితులకు 30 సీట్లు మాత్రమే కేటాయించడం హాట్ టాపిక్‌గా మారింది.
పంచమి తిథి కావడం, పైగా శుభ ముహూర్తం కూడా ఉండటంతో ఎంత మంది సిట్టింగులు అసంతృప్తి చెందినా.. ఆశావహులకు భంగం కలిగినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ప్రకటన చేయాల్సిందేనని కేసీఆర్ ఫిక్స్ అయ్యారు..
అవును.. అదిగో ఇదిగో బీఆర్ఎస్ తొలి జాబితా (BRS First List) వచ్చేస్తోంది.. మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుంది.. నేడే విడుదల.. అని ప్రగతి భవన్‌లో (Pragathi Bhavan) జరిగిన హడావుడి అంతా ఇంతా కాదు. మరోవైపు.. సరిగ్గా 12.03 నుంచి 12:50 నిమిషాల మధ్యలో ప్రకటన ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు (BRS) చెప్పుకున్నప్పటికీ ఇంతవరకూ చలీచప్పుడు లేదు..
ఒకరు కాదు.. ఇద్దరు కాదు పదుల సంఖ్యలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు (BRS Sitting MLAs).. సీఎం కేసీఆర్ (CM KCR) కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో (Kavitha) భేటీ అయ్యారు. టికెట్ రాదని తేలిపోవడంతో ఎలాగైనా సరే ఈ ఒక్కసారి ఛాన్స్ ఇప్పిస్తే గెలుచుకొని వస్తామని కవితకు విన్నవించుకుంటున్నారు..
అవును.. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ చెప్పింది అక్షరాల నిజమయ్యింది. సిట్టింగుల్లో 20 నుంచి 25 మందికి గులాబీ బాస్, సీఎం కేసీఆర్ హ్యాండివ్వబోతున్నారన్న విషయం గత కొన్నిరోజులుగా అటు ఆంధ్రజ్యోతి దినపత్రికలో.. ఇటు దమ్మున్న ఏబీఎన్‌లో వరుస కథనాలు ప్రసారం చేసిన సంగతి తెలిసిందే..
ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. (MLA Jagga Reddy) ఈ పేరు గత వారం పదిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో (TS Politics) ఎక్కువగా వినిపించింది.. కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం.. బీఆర్ఎస్ మంత్రులతో (BRS Ministers) చెట్టాపట్టాలేసుకుని తిరగడం.. ఈ పరిణామాలన్నీ అటు కారు.. ఇటు హస్తం పార్టీల్లో పెద్ద హాట్ టాపిక్‌గా నిలిచాయి..
అవును.. బీఆర్ఎస్ తొలి జాబితా (BRS First List) విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే పలుమార్లు అదిగో.. ఇదిగో అని చెప్పి ప్రతిసారీ వాయిదా వేస్తూ వస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం.. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్ర్యత్యర్థులకు ఊహించని రీతిలో ముందు ఉండాలని.. అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రజాక్షేత్రంలోకి పంపాలన్నది బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) ప్లానట...
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్ది చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయ్. అతి త్వరలోనే బీఆర్ఎస్ అభ్యర్థుల (BRS List) తొలి జాబితాను రిలీజ్ చేయాలని భావిస్తున్న గులాబీ బాస్, సీఎం కేసీఆర్ (CM KCR).. టికెట్లు ఎవరికైతే ఇవ్వట్లేదో వారిని ప్రగతిభవన్‌కు పిలిపించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు...