Home » TG Govt
17 అడుగుల ఎత్తు, చేతిలో బతుకమ్మతో తెలంగాణతనం ఉట్టిపడేలా ‘తెలంగాణ తల్లి విగ్రహం’ దర్శనమివ్వనుంది.
ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను విదేశీ సంస్థ టెర్రాసిస్ నుంచి ‘జాతీయ సమాచార కేంద్రాని (ఎన్ఐసీ)’కి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరులో ఉత్తర్వులిచ్చింది.
రాష్ట్రంలో గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని ఉపముఖ్యమంత్రి భట్టి చెప్పారు. నీళ్లు, నియామకాల కోసం కొట్లాడి సాధించిన తెలంగాణలో ప్రజలు పదేళ్ల పాటు వంచనకు గురయ్యారన్నారు.
కొణిజేటి రోశయ్యలాంటి సహచరుడు మంత్రివర్గంలో ఉంటే.. ముఖ్యమంత్రిగా ఎవరైనా రాణించవచ్చునని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేబర్‌సెస్ విభజనకు ఏకాభిప్రాయం కుదిరింది. ఆ సెస్ విభజనకు రెండు ప్రభుత్వాలు సుముఖత వ్యక్తం చేశాయి.
ఉద్యోగుల అంత్యక్రియల చార్జీలను రూ.30 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్వీసులో ఉన్నప్పుడు ఉద్యోగులు మరణిస్తే అంత్యక్రియల నిమిత్తం ప్రభుత్వం వారి కుటుంబసభ్యులకు రూ. 20వేలు ఇచ్చేది.
317జీవో బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మ్యూచువల్ ట్రాన్స్ ఫర్స్ కోసం వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఫుజ్ పాయిజనింగ్ ఘటనల్లో వారి కుట్ర ఉందని సీతక్క ఆరోపించారు.
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావును విచారించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ విషయంలో దర్యాప్తు అధికారుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హోంశాఖ ముఖ్య కార్యదర్శి.. న్యాయశాఖతో సంప్రదింపులు జరిపాక ఈ మేరకు అనుమతినిచ్చినట్లు తెలిసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై డిసెంబరు 7 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల షెడ్యూల్‌ను సర్కారు విడుదల చేసింది. డిసెంబరు 1 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాల వివరాలను సీఎం కార్యాలయం వెల్లడించింది.