Home » tihar jail
ఎక్సైజ్ పాలసీ కేసు నిందితుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సాయంత్రం తీహారు జైలు అధికారులకు లొంగిపోయారు. వెంటనే ఆయనను రౌస్ అవెన్యూ కోర్టు డిప్యూటీ జడ్జి సంజీవ్ అగర్వార్ ముందు హాజరుపరిచారు. ఈనెల 5వ తేదీ వరకూ కేజ్రీవాల్‌కు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి(CM Arvind Kejriwal) సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటంతో జూన్ 2న ఆయన తిహార్ జైల్లో పోలీసులకు తిరిగి లొంగిపోనున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారానికి పార్టీ అధినేతగా తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన సుప్రీం తలుపు తట్టిన విషయం తెలిసిందే.
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత ఛాలా ధైర్యంగా ఉన్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం నాడు ఆయన తీహార్ జైల్లో కవితను ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై లిక్కర్ స్కామ్ కేసు పెట్టారని ఆరోపించారు.
మద్యం విధానం కేసులో యాభై రోజులుగా తిహాడ్ జైల్లో మగ్గుతున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు ఐదు షరతులతో కూడిన 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికల తుది దశ జూన్ 1న ముగియనున్న నేపథ్యంలో.. జూన్ 2వ తేదీన లొంగిపోవాలని స్పష్టం చేసింది.
మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి శుక్రవారం సాయంత్రం విడుదలయ్యారు. జూన్ 1వ తేదీ వరకూ ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు అధికారులు ఆయనను సాయంత్రం విడుదల చేశారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో (Delhi liquor scam case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. కాగా.. ట్రయల్ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా హాజరుపరచాలంటూ కవిత దాఖలు చేసిన పిటీషన్‌ను కోర్టు అనుమతించినట్లు తెలుస్తోంది. రేపు(మంగళవారం) నేరుగా కోర్టు ముందుకు కవిత రానున్నట్లు సమాచారం.
దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది..
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్ర శేఖర్ తాజాగా మరో లేఖను రాశారు. తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ మెడికల్ బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. జైల్లో ఉండి కేజ్రీవాల్ చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తారని.. ప్రజలు ఎవరూ మోసపోరన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఆదరించరని లేఖలో సుఖేష్ పేర్కొన్నారు. జూన్ 4న ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి సరైన సమాధానం చెబుతారన్నారు.
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు ఎయిమ్స్ (AIIMS)కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు ధ్రువీకరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థిని మెడికల్ బోర్డు శనివారంనాడు పరిశీలించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహాడ్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్‌కు జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు.