Share News

Delhi: ముగుస్తున్న కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ గడువు.. భావోద్వేగానికి గురైన సీఎం

ABN , Publish Date - May 31 , 2024 | 01:18 PM

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి(CM Arvind Kejriwal) సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటంతో జూన్ 2న ఆయన తిహార్ జైల్లో పోలీసులకు తిరిగి లొంగిపోనున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారానికి పార్టీ అధినేతగా తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన సుప్రీం తలుపు తట్టిన విషయం తెలిసిందే.

Delhi: ముగుస్తున్న కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ గడువు.. భావోద్వేగానికి గురైన సీఎం

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి(CM Arvind Kejriwal) సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటంతో జూన్ 2న ఆయన తిహార్ జైల్లో పోలీసులకు తిరిగి లొంగిపోనున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారానికి పార్టీ అధినేతగా తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన సుప్రీం తలుపు తట్టిన విషయం తెలిసిందే. విచారించిన ధర్మాసనం.. ఆయనకు 21 రోజులపాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. గడువు ముగియనుండటంతో ఎల్లుండి ఆయన తిరిగి తిహార్ జైల్‌కి వెళ్లనున్నారు.


ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. "నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుంది. ధర్మాసనం ఇచ్చిన బెయిల్ గడువు ఎల్లుండితో ముగిసిపోతుంది. తిరిగి పోలీసులకు లొంగిపోతున్నా. ఈసారి నన్ను ఎన్ని రోజులు జైల్లో ఉంచుతారో తెలీదు. నన్ను మాట్లాడనివ్వకుండా భయపెట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నించారు. నేను జైలులో ఉన్నప్పుడు నాకు మెడిసిన్స్ ఇవ్వలేదు. 20 ఏళ్లుగా డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నాను. 10 ఏళ్లుగా ఇన్సులిన్ తీసుకుంటున్నాను. రోజు నా పొట్ట భాగంలో 4 సార్లు ఇంజక్షన్ తీసుకుంటాను.

జైల్లో నాకు ఇన్సులిన్ ఇంజక్షన్ ఇవ్వలేదు.దీంతో షుగర్ లెవల్స్ 300-325 వరకు వెళ్లాయి. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే కిడ్నీ, లివర్ దెబ్బతింటాయి. వీళ్లు నా నుంచి ఏం కోరుకుంటున్నారో అర్థం కావడం లేదు. జైల్లో 50 రోజులు ఉన్నాను. 6 కేజీల బరువు తగ్గాను. మళ్ళీ బరువు పెరగడం లేదు. శరీరంలో ఇతర ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చి ఉండొచ్చు. పరీక్షలు చేయాలని వైద్యులు చెబుతున్నారు. యూరిన్ లో కీటోన్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయి . ఢిల్లీ ప్రజలు సంతోషంగా ఉంటే కేజ్రీవాల్ సంతోషంగా ఉంటాడు. నేను మీ మధ్య లేకపోయినా అన్ని పనులు జరుగుతాయి. అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతాయి" అని కేజ్రీ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

For Latest News and National News click here

Updated Date - May 31 , 2024 | 02:29 PM