Home » Tunnel Collapse
శ్రీశైలం కుడి గట్టు కాలువ సొరంగం (ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్)లో జరిగిన దుర్ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రమాదం జరుగుతుందని ముందే తెలిసినా పనులు చేపట్టిందని విమర్శించారు.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎ్‌సఎల్‌బీసీ) టన్నెల్ ప్రమాదం జరిగి తొమ్మిది రోజులైనా.. గల్లంతైన 8 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఆర్మీ, నేవీ, హైడ్రా, ర్యాట్ హోల్ మైనర్స్, సౌత్ సెంట్రల్ రైల్వే, సింగరేణికి సంబంధించి దాదాపు 703 మంది కార్మికులు రేయింబవళ్లు శ్రమిస్తున్నా.. ఆశించిన స్థాయిలో ఫలితం కానరావడం లేదు.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం దుర్ఘటనకు కారణం బీఆర్‌ఎస్సేనని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో టన్నెల్ గురించి పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడీ ప్రమాదం జరిగిందన్నారు.
ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యల్లో కీలక ముందడుగు పడింది. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సహాయంతో.. సొరంగంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది ఆచూకీని గుర్తించారు.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రమాదంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆక్వా ఐ సోనార్ టెక్నాలజీ, గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ (జీపీఆర్)తో టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నించారు.
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ అత్యంత క్లిష్టమైనది. దేశంలో అత్యంత పొడవైన టన్నెల్. మధ్యలో ఎక్కడా కూడా యాడిట్ (బయటకు వెళ్లే ద్వారం లేదు). దేశంలో చాలా టన్నెల్ ప్రమాదాలు చూశాం.
‘‘శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం మధ్యలో బయటికి వెళ్లే దారి లేనందువల్లే టన్నెల్ తవ్వకంలో సమస్యలు వస్తున్నాయి. సొరంగం మధ్యలో దారి ఉంటే టన్నెల్ తవ్వకం మరో విధంగా ఉండేది’’ ప్రస్తుతం ప్రతి ఇంజనీరింగ్ నిపుణుడి నోటా వ్యక్తమవుతున్న అభిప్రాయమిది.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పనులు ముందుకు సాగుతాయా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడున్న టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) కట్టర్ భాగం మినహాయించి మిగతా యంత్రమంతా ధ్వంసమైంది.
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం ఇన్‌లెట్ (దోమలపెంట నుంచి) 14 కిలోమీటర్ల వద్ద యాడిట్ (సొరంగం నుంచి బయటికి వెళ్లే ద్వారం) పెట్టడానికి చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులకు చెప్పారు.
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో చిక్కుకున్న 8 మంది జాడ ఇప్పటికీ తెలియలేదు. శనివారం ఉదయం 8.30 గంటలకు ఈ ప్రమాదం జరగ్గా దాదాపు ఐదు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా...