SLBC Tunnel: లభించని ఆచూకీ..!
ABN , Publish Date - Mar 03 , 2025 | 03:49 AM
శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎ్‌సఎల్‌బీసీ) టన్నెల్ ప్రమాదం జరిగి తొమ్మిది రోజులైనా.. గల్లంతైన 8 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఆర్మీ, నేవీ, హైడ్రా, ర్యాట్ హోల్ మైనర్స్, సౌత్ సెంట్రల్ రైల్వే, సింగరేణికి సంబంధించి దాదాపు 703 మంది కార్మికులు రేయింబవళ్లు శ్రమిస్తున్నా.. ఆశించిన స్థాయిలో ఫలితం కానరావడం లేదు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు
మెత్తటి అవశేషాలను గుర్తించిన సెన్సర్
నేడు ఒక కొలిక్కి వచ్చే అవకాశం!
నాగర్‌కర్నూల్/మహబూబ్‌నగర్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎ్‌సఎల్‌బీసీ) టన్నెల్ ప్రమాదం జరిగి తొమ్మిది రోజులైనా.. గల్లంతైన 8 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఆర్మీ, నేవీ, హైడ్రా, ర్యాట్ హోల్ మైనర్స్, సౌత్ సెంట్రల్ రైల్వే, సింగరేణికి సంబంధించి దాదాపు 703 మంది కార్మికులు రేయింబవళ్లు శ్రమిస్తున్నా.. ఆశించిన స్థాయిలో ఫలితం కానరావడం లేదు. దీంతో గల్లంతైన 8 మంది కార్మికుల బంధువుల్లో తీవ్రమైన ఆందోళన నెలకొంటోంది. ఆదివారం సాయంత్రం వరకు నలుగురి ఆచూకీని కనుగొంటామని.. వారిని బయటకు తీసుకువచ్చే అన్ని ప్రయత్నాలు ముమ్మరం చే శామని మంత్రి జూపల్లి ఇదివరకే ప్రకటించారు. ఈక్రమంలో ఆదివారం ఉదయం 6.45 గంటలకు 150 మంది సభ్యులు గల సహాయక బృందాలు టన్నెల్‌లోకి వెళ్లాయి. శాటిలైట్ సిస్టమ్ ద్వారా మెత్తని అవశేషాలు ఉన్నాయని గుర్తించిన ప్రదేశాల్లో పైపులను లోపలికి పంపించారు.
అయితే.. అక్కడ కార్మికుల ఆనవాళ్లు దొరకనట్లు రెస్క్యూ టీం వర్గాలు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపాయి. 7 మీటర్ల వరకు మట్టి, బురదను తొలగించగలిగామని, నీటి ఊట అధి కం అవుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకాలేర్పడుతున్నాయని సింగరేణి కార్మికులు ఉన్నతాధికారులకు వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. మూడు గ్రేడ్‌లలో కార్మికుల ఆచూకీ కోసం ఆధునిక టెక్నాలజీ ద్వారా మార్కింగ్ చేసినప్పటికీ.. టన్నెల్‌లో బురద కా రణంగా సెన్సర్లు పనిచేయడంలేదని సహాయక సిబ్బం ది చెబుతున్నారు. ఓ వైపు బురద, నీటిని తొలగిస్తున్న కొద్దీ.. నీటి ఊట వస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. శాటిలైట్ సెన్సర్ ద్వారా 5 చోట్ల మెత్తని అవశేషాలను గుర్తించి, అక్కడ దాదాపు 7 మీటర్ల మీర మట్టిని తొలగించినా.. ఎలాంటి ఆనవా ళ్లు లభించలేదు. అవశేషాలకు సంబంధించిన దుర్వాసన కూడా రావడంలేదని కార్మికులు చెబుతున్నారు. దీంతో మరోరోజు నిరీక్షణ తప్పడం లేదని తెలుస్తోంది. నీటి ఊట పెరుగుతున్న నేపథ్యంలో.. ఇప్పటికే డీవాటరింగ్ కోసం 7 పంపులు పనిచేస్తుండగా.. వాటికి అదనంగా మూడు మోటార్లను ఏర్పాటు చేసి, నీటిని తోడున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు.