KTR: ఎస్‌ఎల్‌బీసీ దుర్ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత
ABN , Publish Date - Mar 07 , 2025 | 04:30 AM
శ్రీశైలం కుడి గట్టు కాలువ సొరంగం (ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్)లో జరిగిన దుర్ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రమాదం జరుగుతుందని ముందే తెలిసినా పనులు చేపట్టిందని విమర్శించారు.

ప్రమాదం జరుగుతుందని తెలిసీ సొంత లాభం కోసం పనులు: కేటీఆర్
హైదరాబాద్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం కుడి గట్టు కాలువ సొరంగం (ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్)లో జరిగిన దుర్ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రమాదం జరుగుతుందని ముందే తెలిసినా పనులు చేపట్టిందని విమర్శించారు. గురువారం ఎక్స్‌లో ఆయన పోస్ట్ పెడుతూ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటిస్తూ నిపుణులు ఇచ్చిన రెండు నివేదికలు ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ సొంత లాభం కోసం టన్నెల్ పనులు కొనసాగించి ఎనిమిది మంది కార్మికులను బలితీసుకుందని ఆరోపించారు. నిపుణులు గుర్తించిన ప్రాంతంలోనే ప్రస్తుతం ప్రమాదం జరిగిందని తెలిపారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ సర్కార్ ప్రారంభించిన తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్‌నాలెడ్జ్ (టాస్క్) కు నీతిఆయోగ్ ప్రశంసలు దక్కాయని, ఇది తమ సర్కార్‌చేసిన కృషికి గుర్తింపు అని కేటీఆర్ పేర్కొన్నారు.