Home » University
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్‌టీ)ని స్థాపించి మూడేళ్ల డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్ టెక్నాలజీ కోర్సును 2024-25 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో నంబరు 11ను విడుదల చేసిందని చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజ రామయ్యార్ తెలిపారు.
ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్ అమలు ప్రస్తుతానికి లేనట్టే కనిపిస్తోంది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో అడ్మిషన్లు, నియామకాల్లో రిజర్వేషన్లను అమలు పరచాలని ప్రభుత్వం ఇంతకు ముందు భావించింది.
ముచ్చర్లలో న్యూయార్క్‌ను మించిన మహానగరాన్ని నిర్మిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. నిజాం నవాబు హైదరాబాద్‌ను, బ్రిటి్‌షవాళ్లు సికింద్రాబాద్‌ను, చంద్రబాబు, వైఎ్‌సలు సైబరాబాద్‌ను నిర్మించగా.. నాలుగో నగరాన్ని తాము ముచ్చర్లలో నిర్మిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో నిరుద్యోగితను తగ్గించడం, ప్రైవేటులో యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముచ్చెర్లలో రాష్ట్ర సర్కారు ఏర్పాటుచేస్తున్న ‘యంగ్ ఇండి యా స్కిల్స్ యూనివర్సిటీ’లో వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు నిర్వహించనున్నారు! తొలి ఏడాది ఆరు రంగాల్లో ఉపాధి అవకాశాలున్న కోర్సులను ప్రవేశ పెడతారు.
రాష్ట్రంలో యూనివర్సిటీల్లోని ఖాళీ పోస్టుల భర్తీని ఎప్పుడు చేపడతారనే విషయంలో స్పష్టత రావడం లేదు. యూనివర్సిటీల్లో కొన్నేళ్లుగా నియామకాలు లేకపోవడంతో ప్రొఫెసర్ పోస్టులతో పాటు, బోధనేతర పోస్టులు కూడా భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి.
రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
విశ్వజ్ఞాన కేంద్రంగా భారత్‌ను తిరిగి నిలపడటమే తన లక్ష్యమని ప్రధాని మోదీ ప్రకటించారు. బిహార్‌లోని నలంద యూనివర్సిటీ నూతన క్యాంప్‌సను బుధవారం ఆయన ప్రారంభించారు.
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉప కులపతి (వీసీ) ఖాళీ భరీ కోసం వైద్యశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలను ఏ మాత్రం పాటించలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మానవ మనుగడకు వ్యవసాయమే ఆధారమని గవర్నర్ రాధాకృష్ణన్ అన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విత్తనం కీలకమని, జయశంకర్ వర్సిటీ నాణ్యమైన, మెరుగైన వంగడాలను రైతులకు అందిస్తుండటం హర్షణీయమని అభినందించారు.
శాతవాహన యూనివర్సిటీ ఎల్‌ఎల్‌బీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల్లో అధికారుల నిర్లక్ష్యం వెలుగుచూసింది. ఒక సబ్జెక్టు పేపర్‌లో వచ్చిన నాలుగు ప్రశ్నలు మరో సబ్జెక్టు పేపర్‌లోనూ వచ్చాయి.