Home » Uttarakhand
ఉత్తరఖండ్ రాష్ట్రం ఉత్తర కాశీలోని సొరంగంలో 17 రోజులుగా చిక్కుకుపోయిన కార్మికులు ఎట్టకేలకు బయటకి రావడంపై ప్రధాని మోదీ(PM Modi) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులను ఆయన ఫోన్లో పరామర్శించారు.
ఒకటి కాదు, రెండో కాదు.. ఏకంగా 17 రోజుల సుదీర్ఘ ఎదురుచూపులకు శుభంకార్డు పడింది. మొక్కవోని సంకల్పంతో నిర్వీరామంగా కొనసాగించిన కృషి ఫలించింది. ఇన్నిరోజుల పాటు టన్నెల్‌లోనే చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా ప్రాణాలతో బయపడ్డారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్‌కాశీ టన్నెల్ వ్యవహారానికి ఎట్టకేలకు ‘శుభం కార్డు’ పడింది. ఈ టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ ఎన్నో ఒడిదుడుకుల మధ్య..
పదిహేడు రోజుల నిరీక్షణకు మరి కొద్ది గంటల్లోనే తెరపడనుంది. ఉత్తరాఖండ్ లోని ఉత్తర్కాశి సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది ఏ క్షణంలోనే బయట పడే అవకాశాలున్నాయి. రెస్క్యూ బృందం చేపట్టిన మాన్యువల్ డ్రిల్లింగ్ పనులు మంగళవారం మధ్యాహ్నం పూర్తయ్యాయి.
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో గల సిల్క్యా-బార్కోట్ సొరంగం కూలిన ఘటనలో అందులో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్ పై నుంచి జరుపుతున్న వర్టికల్ డ్రిల్లింగ్ మంగళవారం ఉదయం నాటికి 42 మీటర్లు పూర్తైంది. మొత్తం 82 మీటర్ల లోతు వరకు తవ్వాల్సి ఉంది.
ఉత్తరాఖండ్ సొరంగంలో గత 16 రోజులుగా చిక్కుకుపోయిన 41 మంది కూలీలను రక్షించేందుకు కొండ పైనుంచి నిలుపుగా చేపట్టిన డ్రిల్లింగ్ పనులు చురుకుగా సాగుతున్నాయి. నవంబర్ 30 కల్లా వర్టికల్ డ్రిల్లింగ్ పనులు పూర్తవుతాయని అంచనా వేస్తున్నట్టు నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ అహ్మద్ సోమవారంనాడు తెలిపారు.
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యలకు అవాంతరాలు తప్పడం లేదు. అమెరికా నుంచి తెప్పించిన ఆగర్ మిషన్‌కు ఇనుపపట్టీ అడ్డుపడటం, మిషన్ బ్లేడ్లు దెబ్బతినడంతో హైదరాబాద్ నుంచి కట్టర్‌ను రప్పిస్తున్నారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఉత్తర కాశీ జిల్లాలో సిల్క్యారా వద్ద సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న 41 మంది నేడు బయటకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ఒక పెద్ద పైపు ద్వారా వీల్ చైర్‌ను పంపించి దాని సాయంతో వారిని బయటకు తెచ్చేందుకు యత్నిస్తున్నారు.
ఉత్తరాఖండ్ లోని ఉత్తర్ కాశీ సిల్క్యారా టన్నెల్(Uttarakashi Tunnel Rescue) ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులతో ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ(Pushkar Singh Dhami) సంభాషించారు. ధైర్యంగా ఉండాలని.. మరి కొన్ని గంటల్లో బయటకి వస్తారని భరోసా ఇచ్చారు.
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్ సొరంగ ప్రమాదంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. 11వ రోజుకు చేరుకున్న రిస్క్యూ మిషన్ పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.