Home » Vikarabad
అనంతగిరి అడవుల్లో జరిగిన బైక్, కార్ల రేసింగ్‌ను అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో కార్ రేసింగ్‌పై పోలీసులు విచారణ చేపట్టారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున అడవుల్లో రేసింగ్‌లతో కొందరు యువకులు దుమ్ము రేపి అలజడి సృష్టించారు. రేసింగ్ జరిగిన ప్రాంతాన్ని అటవీ శాఖ, పోలీస్ అధికారులు పరిశీలించారు.
వికారాబాద్: జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు. రాజీనామా లేఖలో బీజేపీ, బీఆర్ఎస్లపై ఆరోపణలు చేశారు.
జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపుతోంది. పాఠశాలలో పిల్లలను పంపించడానికి వెళ్లిన ఓ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో ఎత్తుకెళ్లారు.
వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. బషీరాబాద్ కు చెందిన నగేష్ అనే వ్యక్తిని ఓ ఫిర్యాదు విషయమై పోలీసులు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు రప్పించారు. పోలీస్ స్టేషన్లో ఫిట్స్ రావడంతో స్పృహ కోల్పోయి కుప్పకూలి నగేష్ కింద పడిపోయాడని.. దీంతో వెంటనే చికిత్స నిమిత్తం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న అతి రుద్ర మహాయాగంలో అపశృతి చోటు చేసుకుంది. చివరి రోజు పూర్ణ ఆహుతిలో మంటలు ఎగిసి పడ్డాయి. టెంట్లు, హోమ గుండాలు కాలి బూడిద అయ్యాయి.
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విద్యార్థిని శిరీష హత్య కేసుకు (Sirisha Murder Case) సంబంధించి ఎస్పీ కోటిరెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. ముడు రోజులు దర్యాప్తు జరిపి శిరీష హత్య కేసు ఛేదించామని ఎస్పీ తెలిపారు. శిరీషను హతమార్చింది బావ అనిల్ అని నిర్ధారణ అయ్యిందన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అనిల్ అని తెలిపారు. ఈ నెల 11న హత్య కేసు 302 నమోదు చేసి.. దర్యాప్తు చేసామని ఎస్పీ వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన శిరీష హత్య కేసుపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ కేసును కమిషన్ సుమోటో కేసుగా స్వీకరించింది. కథలాపూర్‌లో బాలిక హత్యపై తక్షణమే ఎఫ్ఐఆర్ FIR నమోదు చేసి.. నిందితులను అరెస్ట్ చేయాలని, 3 రోజుల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని తెలంగాణ డీజీపీని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన శిరీష హత్య కేసు మిస్టరీగా మారింది. నిన్న(ఆదివారం) హత్యగానే తేల్చిన పోలీసులు ఇప్పుడు ఆత్మహత్య కోణంలో దర్యాప్తు చేపట్టారు. శిరీష ముఖానికి, శరీర భాగాలపై గాయాలను పరిశీలిస్తే హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు మాత్రం ఎటూ తేల్చక సస్పెన్స్‌గా కొనసాగిస్తున్నారు.
వికారాబాద్ జిల్లా: పరిగి మండలం కాడ్లాపూర్లో యువతి శిరీష అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. యువతి సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు మమ్మరం చేశారు.
జిల్లాలోని పరిగి కాడ్లాపూర్లో యువతి శిరీష అనుమానాస్పద మృతిపై పరిగి ఎస్సై విఠల్ రెడ్డి స్పందించారు. యువతి అనుమానాస్పద మృతిపై గ్రామస్తులకు పలు అనుమానాలున్నాయన్నారు.