Home » Vizag News
తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) సోమవారం ఎన్నికల సంఘానికి (Election Commission) లేఖ రాశారు. విశాఖ కంచరపాలెంలో తమకు ఓటు వేయలేదన్న కారణంతో ఓ కుటుంబంపై వైసీపీ నేతలు దాడి చేసిన ఘటనను ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా దృష్టికి తీసుకొచ్చారు.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో బంగారం ధరలు కాస్త దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.73 వేల పైచిలుకు ఉంది.
ఈ ఎన్నికల్లో వైసీపీ (YSRCP) తప్పకుండా అధికారంలోకి వస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెల 9న జగన్ సీఎంగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. వేదిక ఎక్కడో రెండు రోజుల్లో చెబుతానని అన్నారు. కేంద్రంలో తమ మీద ఆధారపడే ప్రభుత్వం రావాలని కోరుకుంటానని... ఇది తన స్వార్థమని తెలిపారు.
అన్నదాతలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 31న కేరళ తీరాన్ని తాకుతాయని బుధవారం
సర్వేలను తాను నమ్మనని వైసీపీకి ఈ ఎన్నికల్లో 17కు 175 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ధీమా వ్యక్తం చేశారు. సీఎం, వైసీపీ అధినేత జగన్ రెడ్డి టార్గెట్ అదేనని.. ఆ టార్గెట్ కచ్చితంగా కొడతామని అన్నారు. ప్రభుత్వ పథకాలను ఎన్నికల కమిషన్ ద్వారా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు.
ఓటు హక్కు ఉన్నప్పటికీ, చాలామంది వాటిని సద్వినియోగపరచుకోరు. పోలింగ్ డేను సెలవుగా ఎంజాయ్ చేస్తుంటారు. గంటల తరబడి సమాజం, ప్రభుత్వ పనితీరు, రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఆసక్తి చూపుతారు కానీ..
విశాఖ స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టులో కార్మికుల మధ్య ఏర్పడిన వివాదంపై ఏపీ హైకోర్టు (AP High Court) ఈరోజు(బుధవారం) విచారణ చేపట్టింది. ఈ వివాదంపై యూనియన్ కోర్టు హైకోర్టులో ధిక్కార పిటీషన్ దాఖలు చేసింది. గంగవరం పోర్టులో కార్మికుల ఆందోళనతో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా ఆగిపోయిందని వెంటనే జోక్యం చేసుకోవాలని గతంలో హైకోర్టులో పోర్టు యూనియన్ నేత కేవీడి ప్రసాద్ పిటీషన్ దాఖలు చేశారు.
జాబ్ క్యాలెండర్ పేరుతో సీఎం జగన్ (CM Jagan) నయవంచనకు గురిచేశారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. విశాఖ కంచరపాలెంలో స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్.. పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి గణబాబు ఉత్తర నియోజకవర్గం అభ్యర్థి. విష్ణు కుమార్ రాజు పాల్గొన్నారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై బాలకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) అన్నారు.వేపగుంటా మీనాక్షి కన్వేషన్స్లో కూటమి ఆద్వర్యంలో ఎలైట్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా నితిన్ గడ్కరీ. అనకాపల్లి పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి అసెంబ్లీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు..కూటమి పార్టీల నాయకులు, మేధావులు హాజరయ్యారు.
కొంతమంది తనపై దాడికి ప్లాన్ చేశారని జై భారత్ నేషనల్ పార్టీ (Jai Bharat National Party) అధ్యక్షుడు లక్ష్మీనారాయణ (JD Lakshminarayana) సంచలన ఆరోపణలు చేశారు. తాను సీబీఐ జేడీగా ఉన్నప్పుడు ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడంతో కొన్ని నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చిందన్నారు.ఆ వ్యక్తి అభిమానులు ఇప్పుడు తనపై ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు.