Share News

Venkaiah Naidu: నేను వారిని స్పూర్తిగా తీసుకున్నా.. వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 12 , 2024 | 09:58 PM

పోరాటయోధులు, మహనీయుల చరిత్రలు ఎన్నో చదివాను వాటిని స్పూర్తిగా తీసుకున్నానని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎమ్.వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) తెలిపారు.

Venkaiah Naidu: నేను వారిని స్పూర్తిగా తీసుకున్నా.. వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
Venkaiah Naidu

విశాఖపట్నం: పోరాటయోధులు, మహనీయుల చరిత్రలు ఎన్నో చదివాను వాటిని స్పూర్తిగా తీసుకున్నానని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎమ్.వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) తెలిపారు. కార్యదీక్ష ఉంటే, కార్య దక్షత అదే వస్తుందని చెప్పారు. రాజకీయాల్లో కష్టపడే మనస్తత్వం అవసరం.. ఎదగాలంటే ఒదిగి ఉండాలనే లక్ష్యం కలిగి ఉండాలని అన్నారు. ఈరోజు(శుక్రవారం) రుషికొండ ఏ 1కన్వెన్షన్ సెంటర్‌లో వెంకయ్య నాయుడు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.


75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... రాజకీయాల్లో సిద్ధాంతం తగ్గిపోతుందని...రాద్ధాంతం పెరిగిపోతుందని చెప్పారు. రాజకీయాల పట్ల గౌరవం రోజురోజుకూ తగ్గిపోతుందని అన్నారు. బూతులు మాట్లాడే వారికి ప్రజలు సమాధానం చెప్పారని.. ఎన్నికల్లో సైలెంట్‌గా మార్పు వచ్చిందని తెలిపారు.


ఒక్కో శాసనసభ స్థానానికి వందల కోట్లు ఖర్చుపెట్టారంటే ఏం జరుగుతోంది? అని అన్నారు. సాగరతీరాన్ని చూస్తోంటే ఎంతో ఉత్సాహం.. తనకున్నది మిత్రసంపద...అది అన్నింటకన్నా మిన్న అని చెప్పుకొచ్చారు. విభజన వల్ల ఏపీ నష్టపోకూడదని ఎంతో జాగ్రత్త పడ్డామని గుర్తుచేశారు. ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశామని సాధించుకున్నామని వివరించారు. ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతానికి మేలు చేయాలనే తపన తనకు ఉండేదని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

Updated Date - Jul 12 , 2024 | 09:58 PM